విద్యుదాఘాతంతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
విద్యుదాఘాతంతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
Published Fri, Sep 30 2016 10:56 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
కాకినాడ రూరల్ :
చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కొవ్వాడ పంచాయతీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మళ్ల లక్ష్మయ్య (40) శుక్రవారం రజకపేటలోని దుర్గాదేవి గుడి పరిసర ప్రాంతాల్లో కొమ్మలు తొలగిస్తుండగా 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరుకు కొమ్మ తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురై చెట్టుపైనే మరణించాడు. మూVýæవాడైన లక్ష్మయ్య గంగనాపల్లి పంచాయతీ చినస్వామినగర్ బుల్లబ్బాయిరెడ్డి కాలనీకి చెందిన వాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి మళ్ల రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం ఎస్సై బి.తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఎక్స్‌గ్రేషియా ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని, లక్ష్మణ్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీపీఎం నగరకమిటీ కార్యదర్శి పలివెల వీరబాబు డిమాండ్ చేశారు. సర్పంచ్ సలాది సత్యవతి, ఎంపీటీసీ సభ్యురాలు రెడ్డిపల్లి వీరరాఘవమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్రపార్టీ కార్యదర్శి లింగం రవి, మాజీ సర్పంచ్ గోపిశెట్టి సత్యనారాయణ, ఉపసర్పంచ్ కలకొండ సుధీర్ లక్ష్మణ్ కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
Advertisement