యువకుడి అనుమానాస్పద మృతి
దివిలి (పెద్దాపురం) :
పని ఉందని చెప్పి వెళ్లిన యువకుడు పొలాల్లో శవమై కనిపించిన ఉదంతమిది. పెద్దాపురం మండలం దివిలి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన గంపల రాధాకృష్ణ కుమారుడు శివ(22) పాల కేంద్రంలో పనిచేస్తుంటాడు. శనివారం ఉదయం వెళ్లిన అతడు చెరకు పొలాల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. స్థానికులు సాయంత్రం అతడి మృతదేహాన్ని గమనించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ రాజశేఖరరావు, సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్సై సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వెనుక భాగంలో కాలిన గాయలున్నాయి. అతడి మరణానికి కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.