గురుకుల పాఠశాలల్లో ఎన్‌క్యూపీ | Enkyupi boarding schools | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలల్లో ఎన్‌క్యూపీ

Published Mon, Jul 25 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

మాట్లాడుతున్న పుల్లయ్య

మాట్లాడుతున్న పుల్లయ్య



కల్లూరు: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచేందుకుగాను న్యూ క్వాలిటీ పాలసీ(ఎన్‌క్యూపీ) అమలు చేయనున్నట్టు గురుకుల పాఠశాలల రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.పుల్లయ్య తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక గురుకుల పాఠశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ పాలసీ అమలులో భాగంగా షెడ్యూల్‌ ప్రకారం అన్ని జిల్లాల్లో సబ్జెక్టులవారీగా సెమినార్లు నిర్వహిస్తామని, ఉపాధ్యాయులకు ప్రాజెక్టులు ఉంటాయని చెప్పారు. దీనికి గ్రేడ్స్‌ ఇస్తామన్నారు. గ్రేడ్‌ పాయింట్లు సరిగారాని ఉపాధ్యాయులకు మళ్లీ ట్రైనింగ్‌ ఇస్తామన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకే ఈ విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. కార్పొరేట్‌ స్థాయికి ధీటుగా గురుకుల పాఠశాలల్లో విద్యాబోధన చేయడమే లక్ష్యమని అన్నారు. సమావేశంలో ఎంఈఓ కాకర్ల రంగారావు; కల్లూరు, మధిర ప్రిన్సిపాల్స్‌ ప్రేమారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement