‘గురుకుల’ దరఖాస్తులు వాయిదా
సీఎం ఆదేశాల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా వాయిదా వేసి నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) గురువారం ప్రకటిం చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉన్నా.. నిబంధనల్లో మార్పుల నిమిత్తం వాయిదా వేసినట్లు తెలిపింది. ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్న విషయాన్ని తెలియజేస్తామని పేర్కొంది.
కొత్త మార్గదర్శకాలపై కసరత్తు
గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను, బోధన అనుభవం నిబంధనను తొలగించాలని.. ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు 50% మార్కులతోనే దరఖాస్తులను స్వీకరించాలని సీఎం గురుకుల విద్యాలయాల సంస్థలను ఆదేశించారు. దీంతో సంక్షేమ శాఖలు, గురుకుల విద్యాలయాల సంస్థలు గురువారం హుటాహుటిన సమావే శమై... జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మార్గదర్శ కాల ప్రకారం కొత్త నిబంధనల రూప కల్పనపై కసరత్తు చేశాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో అధికారులు చర్చించారు.
పీఈటీ పోస్టుల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు అవకాశం కల్పించడం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వారికి అవకాశం కల్పించడం, మూడేళ్ల బోధన అనుభవం, డిగ్రీ, పీజీల్లో 60శాతం మార్కులుండాలన్న నిబంధన లను తొలగించేలా చర్యలు చేపట్టారు. టీఎస్ పీఎస్సీ కొత్త నిబంధనలను శుక్రవారం పరిశీలించనుంది. వివరణలు అవసరమైతే తీసుకుని.. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించే అవకాశముంది. లేకపోతే సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.