‘నీ అంతు చూస్తా’పై ఆరా!
Published Sun, Aug 28 2016 8:46 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
వరంగల్ : మహబూబాబాద్‌లో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడికి స్థానిక తహసీల్దార్ మెమో ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తహసీల్దార్‌ను సదరు ప్రజాప్రతినిధి పిలిపించి ‘నీ అంతు చూస్తా’ అంటూ హెచ్చరించిన వ్యవహారం ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథ నం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వ వర్గాల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ నిఘా సంస్థల అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈమేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులు మహబూబాబాద్‌లోని ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి నివేదిక పంపాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోని దిగిన నిఘా వర్గాల ఉద్యోగులు భూ కబ్జా వ్యవహారంపై స్థానికులు, ప్రజాప్రతినిధులతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగుల నుంచి పక్కా సమాచారం సేకరించారు. సదరు ప్రజాప్రతినిధి జోక్యం చేసుకున్న పలు భూకబ్జాలపై కూడా అధికారికంగా సమాచారం సేకరించినట్లుగా భావిస్తున్నారు. ఈ వివరాలను నిఘా విభాగం ఉన్నతాధికారులకు ఆదివారం సాయంత్రమే అందజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నేడు ఉద్యోగ సంఘాల సమావేశం
హన్మకొండ అర్బన్: మహబూబాబాద్ తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను ఓ ప్రజాప్రతినిధి దూషిం చిన ఘటనపై ఏవిధంగా తమ నిరసన తెలుపాలనే దా నిపై చర్చించేందుకు సోమవారం ఉద్యోగ సంఘా లు సమావేశం కానున్నట్లు సమాచారం. ఆదివారం హన్మకొండ రెవెన్యూ అతిథి గృహంలో తహసీల్దార్ల సంఘం, ట్రెసా నాయకులు భేటీ అయినప్పటికీ, సెలవు దినం కావడంతో కొందరు ముఖ్యులు అందుబాటులోకి రాలేదని తెలిసింది. దీంతో రాత్రి వరకు చర్చలు జరిపినప్పటికీ అంతిమ నిర్ణయం మాత్రం సోమవారానికి వాయిదా వేసుకున్నారు. నేడు నిర్వహించనున్న సమావేశం అనంతరం తమ కార్యాచరణను ప్రకటిస్తామని తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పూల్ సింగ్‌చౌహాన్, ట్రెసా అ« ద్యక్ష, కార్యదర్శు లు రాజ్‌కుమార్, సత్యనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement