మొక్కలను సంరక్షించే బాధ్యతనూ తీసుకోవాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ :
మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ చేపట్టాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. అటవీ శాఖ, చిన్నపత్రికల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో గురువారం చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. కాకినాడ పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలను దత్తత తీసుకుని మొక్కలు నాటాలని సూచించారు. డివిజనల్ అటవీ అధికారి ఎం.శ్రీనివాసరావు, కార్పొరేషన్ కమిషనర్ అలీంబాషా, ఆర్డీవో బీఆర్ అంబేద్కర్, డీపీఆర్‌వో ఎం.ఫ్రాన్సిస్, డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, డిప్యూటీ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
04కెకెడి151 : కలెక్టరేట్‌లో మొక్కలు నాటుతున్న కలెక్టర్ అరుణ్‌కుమార్