
నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి
ఘట్‌కేసర్ టౌన్: హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కనూ బతి కించాలని జిల్లా అటవిశాఖాధికారి కృష్ణ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో హరితహారంపై గురువారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం ద్వారా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయని, భవిషత్ తరాలకు పచ్చద నం కానుకగా అందించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా, విద్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యమంలా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.
పంచా యతీల వారిగా కావాలసిన మొక్కల వివరాలను ముందుగా అందజే యాలన్నారు. మొక్కల నాటే విధానం, పెంపకం, రక్షణ విధానం అందుకు అందజేసే ఆర్థిక వనరులపై వివరించారు. సమావేశంలో డీఆర్‌డీఓ పీడీ కౌటిల్యరెడ్డి, డీపీఓ సురేష్‌మోహన్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, జెడ్పీటీసీ సంజీవరెడ్డి, ఎంపీడీఓ శోభ స ర్పంచ్‌లు అబ్బసాని యాదగిరియాదవ్, బట్టె శంకర్, స్టీవెన్, గొంగల్ల మా ధవి, జాదవ్‌శేషారావ్, నాగరాజు, రమేష్, చిలుగూరి పావని, స్వర్ణలత పం చాయత్‌రాజ్ కార్యదర్శులు, వీఆర్వోలు, బిల్ కలెక్టర్లు, అంగన్‌వాడీ టీచర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.