కేడర్‌లో ఉత్తేజాన్ని నింపిన కొప్పన చేరిక
కేడర్‌లో ఉత్తేజాన్ని నింపిన కొప్పన చేరిక
Published Tue, Feb 14 2017 11:32 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
మాజీ మంత్రి కొప్పన మోహనరావు చేరికతో పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి సమక్షంలో కొప్పన పార్టీలో చేరారు.ఈయనతోపాటు పిఠాపురం నియోజకవర్గం నుంచి మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు 60 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. కొప్పన పిఠాపురం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోట్ల విజయభాస్కర రెడ్డి కేబినెట్‌లో అటవీ శాఖా మంత్రిగా, అటవీ అభివృద్ధి కార్పొరేష¯ŒS చైర్మ¯ŒSగా పని చేశారు. పీసీసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. పిఠాపురంలో మంచి పట్టున్న నేతగా ప్రజా సమస్యలపై పోరాడే నేతగా కొప్పనకు మంచి పేరుంది.
జగ¯ŒS పోరాటాలే ఆకర్షించాయి...
పార్టీలో చేరిన సందర్భంగా కొప్పన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగ¯ŒS మోహ¯ŒS రెడ్డి రాష్ట్రంలో ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం ఆకర్షించిందని అన్నారు. చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసి సాగిస్తున్న పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకుందన్నారు. పిఠాపురంలో పార్టీ అభ్యున్నతికి కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు నాయకత్వంలో కలిసి పని చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేర్ చలమలశెట్టి సునీల్, పిఠాపురం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, కొండేటి చిట్టిబాబు, రాష్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, రావు చిన్నారావు, తాడి విజయభాస్కరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, పిఠాపురం ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబి, పార్టీ యువజన విభాగం నాయకుడు మాదిరెడ్డి దొరబాబు తదితరులున్నారు.
Advertisement
Advertisement