ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎన్నుకున్నారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎన్నిక
Published Sun, Aug 7 2016 10:30 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
గుంటూరు (పట్నంబజారు): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎం కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌వీ సుబ్బారావు, కోశాధికారిగా బీఎస్‌ఎన్ రాజు, అసోసియేషన్ అధ్యక్షుడిగా కే నాంచారయ్య, ఉపాధ్యక్షులుగా శివనాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీమన్నారాయణ, సహాయ కార్యదర్శులుగా నాగభూషణం, శంకరరావు, వెంకటస్వామి, రవిశంకర్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎస్ పెద్దయ్య, ఆర్.కోటేశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు, వీ జ్యోతి, సీహెచ్.సాంబశివరావు, సుందరయ్య రాజులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎకై ్సజ్ అధికారులు శౌరి, ఆవులయ్య వ్యవహరించారు. అనంతరం ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను పూలమాలతో ఘనంగా సత్కరించారు.
Advertisement
Advertisement