రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కోదాడఅర్బన్: కోదాడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా టి. వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కె. చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సిహెచ్.సైదయ్య, సంయుక్త కార్యదర్శిగా బి. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి.అప్పారావులను ఎనుకున్నారు. నల్లగొండ జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. చిన్నపురెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికకు కన్వీనర్‌గా కె.నర్సిరెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు పలువురు అసోసియేషన్ నాయకులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిల్లర్లు జి.సత్యనారాయణ, ఎన్.సత్యనారాయణ, వి.బ్రహ్మం, పి.రమేశ్, భానుప్రసాద్, పిచ్చేశ్వరరావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.