చింతపల్లి: ఎండిపోతున్న పత్తి పంటను చూసి దిగులు చెందిన రైతు పాతాళ గంగ కోసం భగీరధ ప్రయత్నం చేశాడు. చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో బుధవారం జరిగింది.
గ్రామానికి చెందిన గండికోట వెంకటయ్య తనకున్న నాలుగెకరాలలో పత్తిపంట సాగు చేశాడు. అయితే సరైన నీటి వసతి లేక పంట ఎండిపోతుండటంతో.. మంగళవారం రాత్రి తన భూమిలో 5 బోర్లు వేశాడు. వాటిలో చుక్క నీరు పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు బోర్లు వేసి.. ఆత్మహత్య
Published Wed, Jul 5 2017 11:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement