నల్లమాడ (పుట్టపర్తి) : నల్లమాడ మండలం కొత్తపల్లి తండాకు చెందిన డి.ఛత్రేనాయక్(56) అనే రైతు విద్యుదాఘాతానికి గురై శుక్రవారం మరణించినట్లు ఎస్‌ఐ గోపీ తెలిపారు. తండా సమీపంలోని వ్యవసాయ బోరుబావి కింద నాయక్ సజ్జ పంట సాగు చేశారు. పంటకు నీరు పెట్టేందుకు ఉదయమే బోరుబావి వద్దకు వెళ్లారు. విద్యుత్ మోటారుకు సపోర్టుగా అమర్చిన జీఏ(ఇనుప) వైరుపై గురువారం రాత్రి గాలి, వానకు స్టార్టర్‌లోని విద్యుత్ వైరు తెగిపడింది.
ఇది గమనించని నాయక్ ప్రమాదవశాత్తు జీఏ వైరును తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేఉ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య తిరుపాలీబాయి, కుమారులు విక్రం, సుమన్ ఉన్నారు.
రైతును కాటేసిన కరెంట్
Published Fri, Apr 28 2017 11:14 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement
Advertisement