డైఫర్స్ గోదాము అగ్నికి ఆహుతి
డైఫర్స్ గోదాము అగ్నికి ఆహుతి
Published Sun, Aug 7 2016 11:43 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
రామవరప్పాడు :
ఎనికేపాడులోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఎనికేపాడు నుండి కానూరు వెళ్లు ఢొంకరోడ్డులో యూని ఛాం ఇండియా లిమిటెడ్ కంపెనీకు చెందిన ఫ్లై జాక్ లాజిస్టిక్స్ పేరున డైఫర్స్ (మమ్మీ ప్యాకో ప్యాడ్స్)ను గోదాములో నిల్వ ఉంచుతూ డిస్టిబ్యూటింగ్ చేస్తున్నారు. సరుకు నిల్వకు వారం రోజుల క్రితం కానూరు వెళ్లు డొంక రోడ్డులో గోదామును తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలప్పుడు గోదాములో స్టాకుకు నిప్పంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఎగసిపడడంతో అప్రమత్తమైన వాచ్‌మెన్, ఇన్‌ఛార్జి భాను ప్రసాద్‌కు సమాచారమందించాడు. అంతలోనే గోదాము మొత్తంఅగ్ని కీలలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గోదాములో స్టాక్ ఉంచిన సుమారు రూ. 2 కోట్ల విలువైన సరుకు అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘనా స్థలానికి చేరుకుని జిల్లా ఫైర్ ఆఫీసర్ నిరంజన్‌రెడ్డి , అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో దాదాపు ఐదు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
తప్పిన పెను ప్రమాదం
త్వరగా అంటుకునే తత్వమున్న డైపర్స్ నిల్వ ఉంచిన ఈ గోదాము నాలుగు వైపులా పెద్ద పెద్ద గోడలతో ఉంది. చుట్టూ ఎతైనా గోడలు ఉండడంతో గాలికి మంటలు పక్కనున్న ఇతర కంపెనీల గోదాములకు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది. షార్టుసర్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండదని పలువురు అనుమానం వ్యక్తబరుస్తున్నారు. ప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement