- ఐదు తాటాకిళ్లు దగ్ధం
- రూ.10 లక్షల ఆస్తినష్టం
నడిపూడిలో అగ్ని ప్రమాదం
Published Sat, Dec 24 2016 11:07 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
అమలాపురం రూరల్ :
పొయ్యి నుంచి లేచిన నిప్పు రవ్వల కారణంగా అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామ శివారు బొక్కా వారి పాలెంలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమా దం సంభవించింది. ఐదు తాటాకిళ్లు దగ్ధమై, ఏడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. తొలుత శీలం సత్యవతి ఇంట్లో పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగిశాయి. ఆ మంటలు పక్కనే ఉన్న చోడే సూరిబాబు, చంద్రకుమార్, రాయు డు వెంకట్రావు, బొక్కా చిన స్వామినాయుడుకు చెందిన ఇళ్లకు వ్యాపించాయి. వీరి ఇళ్లల్లో నివసిస్తున్న చోడే ప్రసాద్, శీలం నాగేశ్వరరావు కుటుం బాలు కూడా వీధిన పడ్డాయి. ఆయా ఇళ్లలో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్ధంతో పేలడం తో బాధితులు ప్రాణభయంతో పరుగులు తీశా రు. సమీపంలో ఉన్న పంట బోదె నుంచి నీటిని తీసుకొచ్చి.. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి బయలుదేరారు. సంఘటన స్థలానికి వెళ్లే మార్గం లేకపోవడంతో.. ఫైర్ ఆఫీసర్ వైవీ జానికిరామ్ ఫైరింజ¯ŒSలోని ఇంజ¯ŒSను వేరుచేసి, ఆటోలో అక్కడకు తరలించి, మంటల ను అదుపు చేశారు. బాధితుల మోటార్ బైక్‌లు, కుట్టు మెషీన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన సమయంలో బాధితులు కూలీ పనులకు వెళ్లిపోవడంతో ఆస్తినష్టం ఎక్కువగా ఉంది. తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయ వెంకటలక్ష్మి, సర్పంచ్ బొక్కా ఆదినారాయణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు బాధితులను పరామర్శించారు.
Advertisement