NADIPUDI
-
తవ్వుకో.. దోచుకో!
టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తున్నామని గొప్పులు చెప్పుకోవడం తప్పించి ఆచరణలో ఇది అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి ర్యాంపులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక తవ్వకాలతో టీడీపీ నేత ఒకరు పేట్రేగిపోతున్నారు. ఒక్క వారం రోజుల్లోనే రూ.50 లక్షలకుపైగా విలువైన ఇసుకను తరలించేశారు. టీడీపీ నేతకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.తవ్వకాలకు అనుమతి లేని రీచ్‌లో భారీ ఎత్తున టీడీపీ నేత ఇసుక కొల్లగొడుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు తూట్లు పొడుస్తూ నదీగర్భంలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి నరసాపురం రూరల్ బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలిసే వరకు వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వేవారు. సముద్రపు పోటుతో ఆయా ర్యాంపుల్లోని ఇసుకలో ఉప్పునీటి సాంద్రత పెరిగింది.దీంతో నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడం, తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా ఈ ర్యాంపులు సీఆర్‌జెడ్ పరిధిలోకి వెళ్లడంతో ఈ రీచ్‌లు మూతపడ్డాయి. ఇసుక కొరత నేపథ్యంలో వీటిని తెరిచేందుకు అధికార యంత్రాంగం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వీటిని తెరిచే వీలులేకపోవడంతో జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, ఔరంగాబాద్ ర్యాంపులను ప్రభుత్వం కేటాయించింది. – సాక్షి, భీమవరంచక్రం తిప్పిన శాండ్ కింగ్..తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు పేరొందిన టీడీపీ నేత కన్ను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపులపైనా పడింది. జట్టు కార్మికుల ప్రాబల్యం తక్కువగా ఉండటం, బాట అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో తన అక్రమ తవ్వకాలకు ఆయన నడిపూడి ర్యాంపును ఎంచుకున్నారు. సాధారణంగా ర్యాంపు తెరవాలంటే నీటిపారుదల, గనులు, కాలుష్యం, రెవెన్యూ తదితర శాఖల అనుమతులు తప్పనిసరి. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించి తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతులో జట్టు కార్మికులతో తవ్వకాలు చేయించాలి. పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. అయితే ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సదరు శాండ్ కింగ్ చక్రం తిప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో నడిపూడి ర్యాంపులో అనధికార తవ్వకాలకు తెరలేపారు. పొక్లెయిన్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్ల లోతున ఇసుకను పైకి తోడి రాత్రివేళల్లో లోడింగ్ చేస్తున్నారు. నిర్మాణ పనులకు అనువు కాదని మూసివేసిన ర్యాంపులో వారం రోజులుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.అదనపు చార్జీల రూపంలో భారీ వసూళ్లు..ఇతర ర్యాంపుల కంటే తక్కువ ధరకు ఇసుక లోడింగ్ చేస్తుండడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి లారీలు నడిపూడి ర్యాంపు వద్ద బారులు తీరుతున్నాయి. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపుల్లో ఐదు యూనిట్ల లోడింగ్‌కు ప్రభుత్వ నిర్ణీత ధరతో పాటు అదనపు చార్జీల రూపంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు టీడీపీ నేత దండుకుంటున్నారు. ఈ అనధికార ర్యాంపులో రూ.2,500కే ఐదు యూనిట్ల ఇసుక లోడింగ్ చేస్తుండడంతో లారీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ర్యాంపు వద్ద నుంచి సిద్ధాంతం వంతెన వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర లారీలు లోడింగ్ కోసం వేచి ఉంటున్నాయి. రోజూ 200కు పైగా లారీలు ఇసుక కోసం వస్తున్నాయి.వీటి నుంచి రూ.6.50 లక్షలు – రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు రూ.అర కోటికి పైగా దండుకోగా ర్యాంపు నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన మొత్తం టీడీపీ అగ్రనాయకత్వానికి చేరుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అక్రమ తవ్వకాల్లో తమకు వాటా ఇవ్వకుండా మొత్తం పొరుగు జిల్లా నేత దోచుకుపోతున్నారని స్థానిక కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. అధికారులకు అందుతున్న ఫిర్యాదుల్లో పేర్లు లేకుండా టీడీపీ నాయకులే చేస్తున్నవే ఎక్కువగా ఉంటున్నట్టు సమాచారం. -
నడిపూడిలో అగ్ని ప్రమాదం
ఐదు తాటాకిళ్లు దగ్ధం రూ.10 లక్షల ఆస్తినష్టం అమలాపురం రూరల్ : పొయ్యి నుంచి లేచిన నిప్పు రవ్వల కారణంగా అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామ శివారు బొక్కా వారి పాలెంలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమా దం సంభవించింది. ఐదు తాటాకిళ్లు దగ్ధమై, ఏడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. తొలుత శీలం సత్యవతి ఇంట్లో పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగిశాయి. ఆ మంటలు పక్కనే ఉన్న చోడే సూరిబాబు, చంద్రకుమార్, రాయు డు వెంకట్రావు, బొక్కా చిన స్వామినాయుడుకు చెందిన ఇళ్లకు వ్యాపించాయి. వీరి ఇళ్లల్లో నివసిస్తున్న చోడే ప్రసాద్, శీలం నాగేశ్వరరావు కుటుం బాలు కూడా వీధిన పడ్డాయి. ఆయా ఇళ్లలో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్ధంతో పేలడం తో బాధితులు ప్రాణభయంతో పరుగులు తీశా రు. సమీపంలో ఉన్న పంట బోదె నుంచి నీటిని తీసుకొచ్చి.. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి బయలుదేరారు. సంఘటన స్థలానికి వెళ్లే మార్గం లేకపోవడంతో.. ఫైర్ ఆఫీసర్ వైవీ జానికిరామ్ ఫైరింజ¯ŒSలోని ఇంజ¯ŒSను వేరుచేసి, ఆటోలో అక్కడకు తరలించి, మంటల ను అదుపు చేశారు. బాధితుల మోటార్ బైక్‌లు, కుట్టు మెషీన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన సమయంలో బాధితులు కూలీ పనులకు వెళ్లిపోవడంతో ఆస్తినష్టం ఎక్కువగా ఉంది. తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయ వెంకటలక్ష్మి, సర్పంచ్ బొక్కా ఆదినారాయణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు బాధితులను పరామర్శించారు.