కదిరి టౌన్ : కదిరిలోని మదనపల్లి రోడ్డులో గల ఆటో డీజల్ గ్యారేజీలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సీపీఐ నాయకుడు అస్లంబాషా గ్యారేజీ బంద్ చేసి ఇంటికెళ్లగా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే గ్యారేజీలోని టైర్లు, పైపులు, ఇతర సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఘటనలో సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.