
కలగళ్లలో భారీ అగ్ని ప్రమాదం
- 14 ఎకరాల్లోని అరటి తోట దగ్ధం
- రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలంలోని కలగళ్లలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి, భాస్కర్‌రెడ్డి అనే రైతులకు సంబంధించిన 14 ఎకరాల్లోని అరటి తోట పూర్తిగా కాలిబూడిదైంది. డ్రిప్ పరికరాలు కూడా కాలిపోయాయి. కాలి బూడిదైపోయాయి. బాధితుల కథనం మేరకు.. అరటి తోటల సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో సమీపంలోని ఎండుగడ్డికి నిప్పు అంటుకుంది.
గాలికి మంటలు విస్తరించి అరటి తోటలకు అంటుకున్నాయి. తోటలోని ఎండుగట్టికి మంటలు అంటుకోవడంతో మరింత ఆజ్యం పోసినట్లైంది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చేలోగానే డ్రిప్ పైపులు, ఇతర విలువైన పరికరాలతో పాటు చెట్లన్నీ కలిపోయాయి. అయితే మంటలు పక్క తోటలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయగలిగారు. ఘటనతో సుమారు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచాన.