మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం | Fire broke out at a garage in HITEC City Madhapur | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Fri, Nov 25 2016 11:22 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఓ కార్ల గ్యారేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాదాపూర్-హైటెక్ సిటీ రూట్‌లో ఉన్న కార్ల గ్యారేజీలో శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్ల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. దాదాపు పది వరకు కార్లు ఈ భారీ ప్రమాదం ఘటనలో అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు, ఆ సమయంలో గ్యారేజీలో ఎవరైనా ఉన్నారా.. ఆస్తి నష్టం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement