లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన సీకే రామాంజికి చెందిన ఐదు మేకలు చింతకాయలు తిని శుక్రవారం ఉదయం మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఎప్పటిలాగే మేకలను మేపుకోవడానికి పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం చింతచెట్లలో కాయలు దులిపి కుప్పగా వేశారు. వాటిని మేకలు తిన్నాయి. కాపరులు కూడా వీటిని గమనించలేకపోయారు. అదే రోజు రాత్రి 20 మేకలలో మూడు మృతి చెందాయి.
మరో ఐదు మేకల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హిందూపురం పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మరో రెండు మేకలు మృతిచెందాయి. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు వైద్యాధికారి ఆస్పత్రికి రాకపోవడంతో రెండు మేకలు చనిపోయాయని బాధితుడు రామాంజి వాపోయారు. డాక్టర్ సకాలంలో వచ్చి ఉంటే ఆ రెండు మేకలు ప్రాణాలతో బయట పడేవన్నారు. రూ.30 వేల దాకా నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు.
చింతకాయలు తిని ఐదు మేకలు మృతి
Published Sat, Feb 18 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
Advertisement
Advertisement