five goats dies
-
చిరుతదాడిలో ఐదు మేకలు మృతి
మడకశిర రూరల్: కోడిగానిపల్లిలో కొట్టంలో కట్టేసిన మేకలపై శుక్రవారం తెల్లవారుజామున చిరుత దాడి చేసింది. పెంపకందారురాలు హనుమక్క శబ్దం విని కేకలు వేసుకుంటూ అక్కడికి వచ్చేసరికి అప్పటికి ఐదు మేకల చిరుతదాడిలో చనిపోయాయి. మరొక మేకను తీసుకుని చిరుత పరుగులు తీసింది. దాదాపు రూ.30వేల నష్టం వాటిల్లిందని బాధితురాలు వాపోయింది. అటవీశాఖ, వెటర్నరీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీంచి మృతి చెందిన మేకలకు శవపరీక్ష నిర్వహించారు. నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని అటవీ శాఖాధికారి శాంప్లానాయక్ తెలిపారు. గ్రామాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించకుండా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచు సావిత్రి, ఎంపీటీసీ సభ్యుడు రామప్ప కోరారు. -
చింతకాయలు తిని ఐదు మేకలు మృతి
లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన సీకే రామాంజికి చెందిన ఐదు మేకలు చింతకాయలు తిని శుక్రవారం ఉదయం మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఎప్పటిలాగే మేకలను మేపుకోవడానికి పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం చింతచెట్లలో కాయలు దులిపి కుప్పగా వేశారు. వాటిని మేకలు తిన్నాయి. కాపరులు కూడా వీటిని గమనించలేకపోయారు. అదే రోజు రాత్రి 20 మేకలలో మూడు మృతి చెందాయి. మరో ఐదు మేకల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హిందూపురం పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మరో రెండు మేకలు మృతిచెందాయి. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు వైద్యాధికారి ఆస్పత్రికి రాకపోవడంతో రెండు మేకలు చనిపోయాయని బాధితుడు రామాంజి వాపోయారు. డాక్టర్ సకాలంలో వచ్చి ఉంటే ఆ రెండు మేకలు ప్రాణాలతో బయట పడేవన్నారు. రూ.30 వేల దాకా నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు.