అంధుల ఆరాధ్యదైవం లూయీ బ్రెయిల్
సక్షమ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు
నిర్మల్‌రూరల్ : చీకటిలో కొట్టుమిట్టాడుతున్న అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు, అంధుల ఆరాధ్యదైవం లూయీ బ్రెయిల్ అని సమదృష్టి క్షమతా వికాస్ ఏవం అనుసంధాన్ మండల్(సక్షమ్) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. స్థానిక టీఎన్జీవోస్ భవనంలో అంధులతో కలిసి లూయీ బ్రెయిల్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అంధులతో కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్ర దివ్యాంగులుగా పేర్కొనే అంధులకు సక్షమ్ సంస్థ అండగా నిలుస్తుందని అన్నారు. చూపు మాత్రమే లేని అంధులు ఆత్మవిశ్వాçÜంతో అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. బ్రెయిల్ అందించిన లిపితో గ్రంథాలనూ రాస్తున్నారని చెప్పారు.
ముఖ్యఅతిథి జిల్లా సంక్షేమాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో అంధులు, దివ్యాంగులకు అన్నిరకాలుగా సాయమందిస్తామని అన్నారు. వారికి అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. అనంతరం పలువురు అంధ ఉద్యోగులను సన్మానించారు. వాకింగ్‌స్టిక్స్‌ను, బ్రెయిల్ లిపి పరికరాలను అందించారు. కార్యక్రమంలో సక్షమ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నూకల విజయ్‌కుమార్, డీసీపీవో సగ్గం రాజు, టీఎన్ జీవోల అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్‌రెడ్డి, సక్షమ్ బాధ్యులు పంచగుడి మహేశ్, అశోక్, ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి కోఆర్డినేటర్ సాయన్న, అంధులు వేణుగోపాల్, సులోచనరాణి, సుకుమార్, సాయికృష్ణ, శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.