Dr Krishnam Raju
-
డాక్టర్ ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్
-
ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది
వైద్యుడి సూసైడ్ నోట్లో గుండెలు పిండేసే నిజాలు.. ఆత్మహత్య అంటే మరణాన్ని కోరుకోవడం కాదు.. బతకాలనే కోరికకు, బతకలేని నిస్సహాయతకు మధ్య పెనుగులాట... నన్ను రక్షించండంటూ... వేడుకొనే ఓ ఆర్తనాదం...ఆత్మహత్య చేసుకునేవారి స్థితిపై మానసిక నిపుణుల విశ్లేషణ... అమలాపురం వైద్య కుటుంబ విషాదం విషయంలో ఇది నిజం. వారు చేసిన అప్పు కొంతైతే...నమ్మించి కాటేసిన నమ్మక ద్రోహుల వెన్నుపోట్లు ఉన్నాయి. తమ ముగ్గురి మరణాలకు మరో ముగ్గురి మాయమాటలే కారణమని వైద్యుడు కృష్ణ సందీప్ తన నోట్లో ఆత్మహత్య చేసుకునే ముందు ఆవేదనా భరితంగా రాసుకున్నాడు. మా జీవితాలు ఇంత సిల్లీగా ముగిసిపోతాయని మేమెప్పుడూ ఊహించలేదు...మా నాన్నగారి అతి మంచితనమే మా తనువులను తుంచేది. సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) పట్టణంలో సంచలనం కలిగించిన డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్యకు రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులు ముగ్గురు చేసిన మోసమే ప్రధాన కారణమని ఆయన పెద్దకుమారుడు డాక్టర్ కృష్ణసందీప్ రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. దానివల్లే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కుటుంబం ఆత్మహత్య దిశగా అడుగులు వేసింది. డాక్టర్ కృష్ణ సందీప్ తమ సూసైడ్ నోట్లో ‘మా జీవితాలు ఇంత సిల్లీగా ముగిసిపోతాయని మేమెప్పుడు ఊహించలేదు.. నాన్నగారు అందరినీ సునాయాసంగా నమ్మేస్తారు. అందుకే కొందరి చేతుల్లో ఘోరంగా మోసపోయారు. చివరకు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు నాన్నగారిని నమ్మించి రూ.ఐదు కోట్ల వరకూ మోసం చేశారు.’ అని పేర్కొన్నారు. ఈ నోట్లో కృష్ణ సందీప్ తమ తండ్రి మంచితనం, అందరినీ నమ్మే గుణాన్ని ఉటంకిస్తూ అప్పులు చేసే ముందు... ఏవేవో నమ్మకాలతో ఎవరివెరినో నమ్మే ముందు కుటుంబ సభ్యులమైన తమతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే తమ కుటుంబానికి ఇంతటి దారుణమైన ముగింపు వచ్చిందని రాశారు. ‘హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు నాన్నగారిని రైస్పుల్లింగ్తో మీ అప్పులన్నీ తీరిపోయి ధనిక స్థితి వస్తుందని సెంట్‌మెంట్‌తో నమ్మించారు’ అని డాక్టర్ కృష్ణ సందీప్ నోట్లో పేర్కొన్నారు. ‘బియ్యాన్ని ఆకర్షించే విగ్రహం లేదా దైవానికి సంబంధించిన వస్తువును మీ వద్ద ఉంచుకుంటే అది మీ జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంద’ని రైస్‌పుల్లింగ్ ముఠా సభ్యులు నమ్మిస్తారు. అత్యంత మహిమ కలిగినది అంటూ విగ్రహం లేదా దైవానికి సంబంధించిన వస్తువు చుట్టూ బియ్యాన్ని వలయాకారంలో ఉంచుతారు. కొన్ని శాస్త్రీయ ప్రక్రియలతో ఆ బియ్యం అయస్కాంతానికి ఇనుము ఆకర్షించబడినట్టు ఆ విగ్రహం లేదా వస్తువు వద్దకు వచ్చేస్తాయి. అలా హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మోసగాళ్లు డాక్టర్ రామకృష్ణంరాజును ఈ రైస్ పుల్లింగ్లోకి లాగారు. వారికి ఆయన ఒకసారి రూ.రెండు కోట్లు, మరోసారి రూ.3 కోట్లు ఇచ్చారు. ఈ రైస్ పుల్లింగ్‌లో నిలువునా మోసపోయిన రామకృష్ణంరాజు ఈ రూ.5 కోట్ల కోసం అప్పులు చేశారు. బ్యాంక్‌లు, ప్రైవేటు ఫైనాన్సర్లనుంచి ఈ రుణాలు తీసుకున్నారు. ఈ ఒత్తిడి పెరగడానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిన ఆయనకు అది కూడా కలసి రాలేదు. అప్పుల భారం తడిసి మోపెడయ్యింది. ఇదే విషయాన్ని డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్లో అత్యంత దీనంగా వివరించారు. ‘అసలు మా అమ్మ, మా ఇద్దరి అన్నదమ్ముల సంతకాలు లేకుండా నాన్న గారి ఒక్క సంతకంతో మా ఆస్తులన్నీ కోల్పోవలసిందేనా?’ అని ఆయన ఆవేదనగా అక్షరరూపంలో ఆడిగారు. ‘ఎవరినీ క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాం’ అంటూ కృష్ణ సందీప్ ఆ నోట్లో సంతకం చేసి తన ఉత్తరాన్నే కాదు.. జీవితాన్నే ముగించారు. రైస్‌పుల్లింగ్ ముఠా కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు డాక్టర్ రామకృష్ణంరాజును రైస్‌పుల్లింగ్ పేరుతో మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలించేందుకు మూడు పోలీసు బృందాలను తెలంగాణ రాష్ట్రానికి పంపించారు. రామకృష్ణంరాజు స్వస్థలమైన కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపేటకు కూడా ఓ పోలీసు బృందాన్ని పంపించారు. సూసైడ్ నోట్లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి పేర్లను డాక్టర్ కృష్ణ సందీప్ రాశారు. ఆ సూసైడ్ నోట్‌ను డాక్టర్ రామ కృష్ణంరాజు బంధువుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా నాన్న, అమ్మ, అన్నయ్య మరణాలతో చిన్న కుమారుడు కృష్ణవంశీ కోలుకోలేకపోతున్నారు. బంధువులు అతనికి మానసిక ధైర్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ కుటుంబ సభ్యుల మృతదేహాలను శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి పది గంటలకు పోస్టు మార్టం పూర్తయ్యాక మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృత దేహాలకు రాజమహేంద్రవరం రోటరీ శ్మశాన వాటికలో శనివారం దహన సంస్కారం చేశారు. ఎంపీ అనురాధ పరామర్శ అమలాపురం టౌన్: డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దయనీయమని ఎంపీ చింతా అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డాక్టర్ రామ కృష్ణంరాజు ఇంటిని శుక్రవారం సాయంత్రం సందర్శించి డాక్టర్ రెండో కుమారుడు కృష్ణ వంశీని పరామర్శించి ఓదార్చారు. అప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్, ఆయన భార్య, పెద్ద కుమారుడు మృత దేహాలను చూసి చలించారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను రూరల్ సీఐ ఆర్.భీమరాజు ఎంపీ అనురాధకు వివరించారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు, న్యాయవాది తాళ్ల సాంబమూర్తి తదితరులు ఉన్నారు. చదవండి : వైద్య వనంలో విషాదం.. -
ఒంటరైన కృష్ణవంశీ
తన వద్దకు వివిధ రోగాలతో వచ్చిన ఎంతో మంది రోగులకు సాంత్వన చేకూర్చే చేయి అది... వెంటాడిన రోగంతో జీవితంపైనే విసిగి, వేసారిన బాధాతప్త హృదయాలకు పలు సూచనలిచ్చి ధైర్యం నింపిన ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడాయన.భగవంతుడు ఇచ్చిన జీవితంలో లోపాలుంటే మంచి వైద్యంతో సరిదిద్దుకొని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని ధైర్యం నూరిపోసి జన జీవన స్రవంతిలో కలిసేటట్టు చేసిన వైద్యుడాయన..మానవ శరీరంలో ఎన్నో ఎముకలు, ఆ అమరికలో తేడాలొచ్చి మొరాయిస్తే సరి చేసి నొప్పులను మటుమాయం చేసే హస్తవాసి ఆయనది... అమలాపురంలో ఓ నర్సింగ్ హోం ...రోగులకు అందుబాటులో ఉండడమే కాదు ... తన ఇద్దరు కొడుకులను కూడా వైద్య విద్యవైపే అడుగులు వేయించిన ముందుచూపున్న తండ్రి ఆయన... పెద్ద కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎముకల వైద్యంలో ఎండీ చేయాలని సమాయత్తమవుతున్నాడు...చిన్న కుమారుడు కూడా ఎంబీబీఎస్ చదువుతూ అదే బాటలో పయనిస్తున్నాడు. సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : ఆస్తులకు మించి ఉన్న అప్పుల భారం నుంచి శాశ్వతంగా దూరమయ్యేందుకు ఆ వైద్యుడి కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. రూ.కోట్లలో స్థిరాస్తులున్నా.. అంతకుమించిన రూ.10 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు తనతో పాటు తన భార్య, తన పెద్ద కుమారుడి ఊపిరి తీసుకున్నారు. అమలాపురం కాలేజీ రోడ్డులో సుబ్రహ్మణ్యస్వామి గుడి వీధిలో ఉన్న శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం శుక్రవారం ఉదయం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. డాక్టర్ రామకృష్ణంరాజు (55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), వారి పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణ సందీప్ (25) బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వీరి చిన్న కుమారుడు కృష్ణవంశీ రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో ఆఖరి సంవత్సరం వైద్య విద్య చదువుతున్నాడు. సామూహికంగా ఆత్యహత్య చేసుకునేందుకు చిన్న కుమారుడిని కూడా తండ్రి రమ్మని పిలిచినా పనుండి రాకపోవడంతో కృష్ణ వంశీ చావు నుంచి తప్పించుకున్నాడు. అయితే మొత్తం కుటుంబాన్నే కోల్పోయి కోలుకోలేని దెబ్బతిన్నాడు. శుక్రవారం ఉదయం డాక్టర్, మందుల షాపును నిర్వహించే ఆయన భార్య తాము నివాసం ఉండే పై అంతస్తు నుంచి కింద ఉన్న హాస్పిటల్‌కు రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూడగా మెట్ల వద్ద గేటుకు తాళం వేసి ఉంది. ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో అనుమానంతో సిబ్బంది గోడ దూకి వెళ్లి తలుపులు గెంటి చూడగా డాక్టర్ కుటుంబీకులు నేలపై విగత జీవులై పడి ఉన్నారు. ఉలిక్కిపడిన అమలాపురం డాక్టర్ కుటుంబం ఆత్యహత్యతో అమలాపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపేటకు చెందిన డాక్టర్ రామకృష్ణంరాజు సౌమ్యుడు. పాతికేళ్ల క్రితం కోనసీమకు చెందిన లక్ష్మీదేవిని ఆయన పెళ్లి చేసుకుని అమలాపురంలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా స్థిరపడ్డారు. అమలాపురం కాలేజీ రోడ్డులో హస్పిటల్ భవనాన్ని, నివాస గృహాన్ని కలిపి సువిశాలంగా నిర్మించుకున్నారు. పది మంది సిబ్బందితో ఎప్పుడూ పేషంట్లతో హడావుడిగా ఉండే ఆ ఆసుపత్రి డాక్టర్ కుటుంబం ఆత్మహత్యతో ఒక్కసారిగా కళతప్పి నిస్తేజంగా మారింది. డాక్టర్ ద్వారా చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న పట్టణానికి చెందిన అనేక మంది ఆయన కుటుంబం ఆత్మహత్య వార్త తెలిసి భారీగా అక్కడికి తరలివచ్చి విలపించారు. ఆత్యహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకునే ముందు డాక్టర్ తన సొంత దస్తూరీతో సూసైడ్ నోట్ రాశారు. అందులో అప్పుల పాలు ఎలా అయ్యాను. ఎందుకు తీర్చలేకపోయాను. తనను ఎవరెవరు మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఎవరెవరు విపరీతంగా ఒత్తిళ్లు చేశారు. ఎవరు తన వద్ద నుంచి రూ.రెండు కోట్లు తీసుకుని మోసం చేశారు. తనకు ఇవ్వాల్సిన వారు ఇవ్వకుండా తనను ఎంత ఇబ్బంది పెట్టారో ఆ నోట్లో రాశారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతోందని ఆ నోట్లో రాశారు. ఈ సూసైడ్ నోట్‌ను డీఎస్పీ బాషా స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లోని వివరాల దిశగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా, అమలాపురం పట్టణ సీఐ బి.సురేష్‌బాబు, రూరల్ సీఐ ఆర్.భీమరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. డాక్టర్ రామకృష్ణంరాజు, భార్య లక్ష్మీదేవి, కుమారుడు డాక్టర్ కృష్ణ సందీప్ అప్పులపాలైంది ఇలా.. మూడేళ్ల క్రితం వరకూ డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం, ఆసుపత్రి అంతా సజావుగా సాగిపోయింది. తన ఇద్దరు కుమారులను డాక్టర్లను చేయాలన్న కలను నెరవేర్చుకున్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ అయ్యాడు. చిన్న కుమారుడు త్వరలో డాక్టర్ కాబోతున్నాడు. ఇటీవల కాలంలో డాక్టర్ కృష్ణంరాజు భూములు కొనుగోలు చేయడం, లాభాలకు విక్రయించడం ఇలా క్రమేపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు వెళ్లారు. రూ.కోట్లతో భూములు క్రయ, విక్రయాలు సాగేవి. వీటిలో ఆయన విపరీతంగా నష్టపోయారు. దీంతో విధిలేక తొలుత వాణిజ్య బ్యాంకుల్లో...తర్వాత ప్రైవేటు ఫైనాన్సర్ల వద్ద అప్పలు చేశారు. రూ.10 వడ్డీలకు ఆయన ప్రైవేటు అప్పులు చేశారు. వాటి చెల్లింపులపై నెల రోజులుగా విపరీతమైన ఒత్తిళ్లు పెరిగిపోయాయి. మూడు రోజుల్లో బ్యాంక్ అధికారులు, వడ్డీ వ్యాపారులు ఆసుపత్రికి, ఇంటికి వచ్చి ఆస్తులు జప్తు చేస్తామన్న హెచ్చరికలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ తన ఇల్లు, ఆస్పత్రి కలిపి ఉన్న విశాలమైన భవనాన్ని కూడా ఇటీవల బేరం పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫైనాన్సియర్ ‘మీ అప్పులు పూర్తిగా తీర్చేలా మార్గం నేను చూస్తాను. అప్పు ఎంతో ఉందో అంత మొత్తం నేనే అప్పుగా ఇస్తాను. ముందు రూ.రెండు కోట్లు చెల్లించమ’ని చెప్పిన మాటలను డాక్టర్ నమ్మేసి అంత మొత్తం అతికష్టంగా సమకూర్చారు. తర్వాత ఆ ఆసామి ఆ డబ్బును కాజేసి నమ్మక ద్రోహం చేశాడు. ఆ మోసాన్ని కూడా డాక్టర్ తట్టుకోలేకపోయి మానసికంగా కుంగిపోయారు. ఆన్లైన్ లావాదేవీలతో తనను కొందరు మోసం చేసినట్టు ఆస్పత్రి సిబ్బంది వద్ద తరచూ చెప్పి డాక్టర్ విలపించేవారు. ఒంటరైన కృష్ణవంశీ నాన్న, అమ్మ, అన్నయ్య ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూసి మృతుడు డాక్టర్ రామకృష్ణంరాజు చిన్న కుమారుడు, వైద్య విద్యార్థి కృష్ణ వంశీ తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తండ్రి గురువారం సాయంత్రం ఫోన్ చేసి ‘అప్పుల భారాన్ని ఇక తట్టుకోలేను. మనమందరం కలసి ఆత్మహత్యలు చేసుకుందాం...నువ్వు కూడా రాజమహేంద్రవరం నుంచి వచ్చేయ్’అని అన్నారు. అయితే కృష్ణ వంశీ తన తండ్రిని ఫోన్లోనే సముదాయించి కంగారు పడకండి.. నాకు రేపు ఉదయం (శుక్రవారం) పరీక్ష ఉంది. అది రాసి రేపు సాయంత్రానికి వస్తాను. అప్పటి దాకా ఎలాంటి ఆలోచన్లు వద్దు అని చెప్పాడు. అయితే ఉదయాన్నే నాన్న, అమ్మ, అన్నయ్య ఆత్యహత్యలు చేసుకున్నారన్న ఫోన్‌తో కృష్ణవంశీ రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాల నుంచి వచ్చాడు. తన కుటుంబంలో అందరూ ప్రాణాలు తీసుకోవడంతో కృష్ణ వంశీ ఒంటరైపోవడాన్ని చూసి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి : డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..! -
అంధుల ఆరాధ్యదైవం లూయీ బ్రెయిల్
సక్షమ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు నిర్మల్‌రూరల్ : చీకటిలో కొట్టుమిట్టాడుతున్న అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు, అంధుల ఆరాధ్యదైవం లూయీ బ్రెయిల్ అని సమదృష్టి క్షమతా వికాస్ ఏవం అనుసంధాన్ మండల్(సక్షమ్) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. స్థానిక టీఎన్జీవోస్ భవనంలో అంధులతో కలిసి లూయీ బ్రెయిల్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అంధులతో కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్ర దివ్యాంగులుగా పేర్కొనే అంధులకు సక్షమ్ సంస్థ అండగా నిలుస్తుందని అన్నారు. చూపు మాత్రమే లేని అంధులు ఆత్మవిశ్వాçÜంతో అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. బ్రెయిల్ అందించిన లిపితో గ్రంథాలనూ రాస్తున్నారని చెప్పారు. ముఖ్యఅతిథి జిల్లా సంక్షేమాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో అంధులు, దివ్యాంగులకు అన్నిరకాలుగా సాయమందిస్తామని అన్నారు. వారికి అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. అనంతరం పలువురు అంధ ఉద్యోగులను సన్మానించారు. వాకింగ్స్టిక్స్ను, బ్రెయిల్ లిపి పరికరాలను అందించారు. కార్యక్రమంలో సక్షమ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నూకల విజయ్‌కుమార్, డీసీపీవో సగ్గం రాజు, టీఎన్ జీవోల అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్రెడ్డి, సక్షమ్ బాధ్యులు పంచగుడి మహేశ్, అశోక్, ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి కోఆర్డినేటర్ సాయన్న, అంధులు వేణుగోపాల్, సులోచనరాణి, సుకుమార్, సాయికృష్ణ, శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో దివ్యాంగులను గుర్తించడమే లక్ష్యం
సక్షమ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు నిర్మల్‌రూరల్ : క్షేత్రస్థాయిలో ఉన్న దివ్యాంగులకు గుర్తిం చడమే సమదృష్టి క్షమత వికాస్ ఏవం అనుసంధాన్ మం డల్ (సక్షమ్) ప్రధాన లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని విశ్వబ్రాహ్మ ణ సంఘంలో ఆదివారం జిల్లా సమావేశాన్ని నిర్వహిం చారు. పలు మండలాల అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సమగ్ర వికాసం కోసం పనిచేసే జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థ సక్షమ్ అని పేర్కొన్నారు. జిల్లాలో మండలాల వారీగా కమిటీలను నియమించి దివ్యాంగుల వివరాలను తెలుసుకుంటామని అన్నారు. విభిన్న ప్రతిభగల దివ్యాంగుల ను గుర్తించి వారికి వర్క్‌షాప్‌లను నిర్వహించి ఉపాధి క ల్పించేందుకు సక్షమ్ కృషిచేస్తుందని తెలిపారు. జనవరి 4న లూయిబ్రెయిలీ జయంతిని స్థానిక టీన్ జీవో భవన్ లో నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్ర చార ప్రముఖ్ పి.బాలకృష్ణ, మండల అధ్యక్షుడు కత్రోజి అశోక్, కార్యదర్శి పంచగుడి మహేశ్, కోశాధికారి రాం దాస్, సభ్యులు మోహన్ దాస్, సట్ల లక్ష్మణ్, భూమేశ్, వివిధ మండలాల నూతన అధ్యక్షులు పాల్గొన్నారు. మండల కార్యవర్గం కార్యక్రమంలో సంక్షమ్ మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా సట్ల లక్ష్మణ్(భైంసా), పి.శ్యామ్(తానూర్), ఎం.సుధాకర్(లోకే శ్వరం), ఎస్.మారుతి(దిలావర్పూర్), ఎస్.సాయన్న(సారంగపూర్), డి.సాయన్న(నర్సాపూర్), డాక్టర్ వినోద్(సోన్), సాయినా«థ్(ముధోల్), ఐ.రవి(లక్ష్మణచాంద), సురేశ్(మామడ), ప్రసాద్‌గౌడ్(కడెం), డాక్టర్ రాము(దస్తురాబాద్)లను ఎన్నుకున్నారు.