అనాథ యువతి వివాహానికి మాజీ ఎమ్మెల్యే చేయూత
చౌదర్‌పల్లి (దేవరకద్ర రూరల్): మండలంలోని చౌదర్‌పల్లిలో ఆదివారం జరిగిన అనాథ యువతి వివాహానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి చేయూత అందించారు.
గ్రామానికి వెళ్లి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లికూతురుకు పార్టీ తరపున పట్టుచీరతోపాటు రూ.3వేలు అందజేశారు. అలాగే త్వరలో పార్టీ నుంచి రూ.25వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు, సత్యనారాయణ, ఎక్బాల్‌బాష, కుర్మన్న, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.