కొత్తచెరువు (పుట్టపర్తి) : అక్రమంగా విద్యుత్ వాడుకున్నారని ఏడాది కిందట నమోదైన కేసులో నిందితుడైన కొత్తచెరువు మాజీ సర్పంచి హరినాథ్‌చౌదరిని జిల్లా యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బుక్కపట్నం రహదారిలో ఉన్న వాటర్‌ప్లాంట్‌కు ఆయన అక్రమ విద్యుత్ వాడుతున్నారని అప్పట్లో విద్యుత్ అధికారులు రూ.3 లక్షలు పైబడి జరిమానా విధించారు.
అప్పటి నుంచి జరిమానా చెల్లించకపోవడంతో వారు ఆయనకు నోటీసులు జారీచేస్తూ వచ్చారు. చివరకు అరెస్టు వారంట్ జారీ కావడంతో శుక్రవారం జిల్లా యాంటీ పవర్ టెప్తు స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ శీననాయక్‌ను వివరణ కోరగా విద్యుత్ చౌర్యం ఘటనలో జరిమానా చెల్లించకపోతే అరెస్టు తప్పదన్నారు.
మాజీ సర్పంచ్ అరెస్టు
Published Fri, Mar 3 2017 10:19 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
Advertisement
Advertisement