పట్టా తాకట్టు! | formers problems | Sakshi
Sakshi News home page

పట్టా తాకట్టు!

Published Sun, Jul 2 2017 2:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

formers problems

► అన్నదాత అప్పుతిప్పలు
► రుణాలివ్వని బ్యాంకర్లు
► వడ్డీ వ్యాపారులే దిక్కు
► పట్టాపాస్‌బుక్‌ గిరి పెడితేనే రుణాలు
►  పంటనూ తమకే  విక్రయించాలని షరతులు


బాన్సువాడ టౌన్‌(బాన్సువాడ) : రైతులకు కొత్త కష్టం వచ్చింది. సరైన వర్షాలు లేకపోవడంతో పంటలను గట్టెక్కించుకోవడానికి ఇబ్బంది పడ్డ అన్నదాత.. ప్రస్తుతం అప్పపుట్టక విలవిల్లాడుతున్నాడు. ఈ సారి తొలకరి జల్లులు ముందే పడడంతో మురిసిన రైతులు పంటలసాగు ప నులు మొదలుపెట్టారు. అయితే బ్యాం కుల్లో అప్పు పుట్టక, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

తమకు ఉన్న ఏకైక ఆధారం భూమి పట్టా పుస్తకాలను కుదవపెడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే సమయంలో రైతులు అధికారులతో ఈ విషయం తెలిపారు. జిల్లాలో చాలా మంది రైతులు తమ భూమి పట్టాపాసు పుస్తకాలను అప్పు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద కుదవపెట్టినట్లు తెలిసింది. పంటను తమకే విక్రయించాలని వడ్డీ వ్యాపారులు ఒప్పందం రాయించుకుంటున్నారని సమాచారం.

నగదు కొరతతో ఇబ్బందులు
నోట్ల రద్దు తర్వాత మార్కెట్‌లో నగదు లభ్యత తగ్గింది. బ్యాంకుల్లోనూ డబ్బులు ఉండడం లేదు. బడాబాబులు పెద్దనోట్లను తమ లాకర్లలో దాచుకున్నారు. బ్యాంకుల్లో దాచుకోవడం కన్నా ఇంట్లో పెట్టుకోవడమే ఉత్తమమని చాలా మం ది భావిస్తున్నారు. దీంతో నగదు కొరత తీవ్రమైంది. రైతులు విక్రయించిన ధా న్యం డబ్బులు ఖాతాల్లో జమ అయినా.. నగదు కొరతతో వాటిని బ్యాంక ర్లు ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు 2017–18 కి సంబంధించి వార్షిక పంట రుణ ప్రణాళిక ప్రకటించినప్పటికీ రుణాలను ఇవ్వలేకపోతున్నారు.

లక్ష్యానికి దూరంగా..
గతేడాది ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రూ. 3,931 కోట్ల రుణ లక్ష్యం ఉండగా.. రూ. 3,140 కోట్లు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో వార్షిక పంట రుణ ప్రణాళిక రూ. 2,409 కోట్లు కాగా, కామారెడ్డి జిల్లాలో రూ. 1,674 కోట్ల రుణాలు అందజేయాలన్నది లక్ష్యం.. ఈ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు 25 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సగం లక్ష్యం కూడా చేరుకోలేదు. చాలా వరకు బ్యాంకులు రు ణాలను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.

నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు నిల్వలు భారీగా పడిపోయా యి. చాలా బ్యాంకుల్లో నోక్యాష్‌ బోర్డు లే కనిపిస్తున్నాయి. రైతు రుణాలను త ప్పనిసరిగా చెల్లించాల్సి వస్తే సగం అ కౌంట్‌లో జమ చేస్తున్నారు. విచిత్రంగా సదరు బ్యాంకుకు చెందిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, దాని ద్వారా చెల్లింపులు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. బ్యాంకు అధి కారులు ఇస్తున్న ఉచిత సలహాలతో రైతులు విస్తుపోతున్నారు. పెద్దగా చదువుకోనివారు యాప్‌ ద్వారా ఎలా లావాదేవీలు నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేటు వ్యాపారుల వద్దకు..
రుణాలివ్వడంలో బ్యాంకులు చేతులు ఎత్తేస్తుండడంతో రైతులు ప్రైవేటు వ్యా పారులను ఆశ్రయిస్తున్నారు. భూమి హక్కులకు సంబంధించి రెవెన్యూ వి భాగం రైతులకు రెండు పాస్‌పుస్తకాల ను అందజేస్తోంది. అందులో ఒకటి టై టిల్‌డీడ్‌ పుస్తకం కాగా మరొకటి పాస్‌ పుస్తకం. ఆర్డీవో సంతకం ఉండే టైటిల్‌ పుస్తకాలు ఇది వరకే బ్యాంకుల్లో ఉండడంతో.. అప్పుల కోసం రైతులు తమ వద్ద ఉన్న రెండో పాసుపుస్తకాన్ని ప్రైవే టు వ్యాపారుల వద్ద కుదవపెడుతున్నారు. జిల్లాలోని గా>ంధారి, బీర్కూర్, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల్లో 40 శాతం రైతులు పాసు పుస్తకాలను తాకట్టు పెట్టినట్లు సమాచారం.

వీరు ప్రతి ఏటా వ్యవసాయ పెట్టుబడులకు తమ పాసు పుస్తకాలను వడ్డీవ్యాపారుల వద్ద ఉంచి కావాల్సిన పెట్టుబడులు తెచ్చుకుంటారు. కొందరు వ్యాపారులైతే తమకే పంట ఉత్పత్తులను విక్రయించాలని ఒప్పందం చేసుకుంటున్నారని, దీనికి అంగీకరించకపోతే రుణాలు ఇవ్వడం లేదని తెలిసింది. రైతు సమగ్ర సర్వే కోసం గ్రామాలకు వెళ్లిన వ్యవసాయ అధికారులకు ఈ విషయాన్ని చెప్పుకున్నట్లు సమాచారం. అధికారులు స్పందించి, పంట రుణాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement