పోటీ పరీక్షల కోసం ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
Published Tue, Aug 9 2016 7:49 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM
వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పోటీపరీక్షలకు ఉచిత శిక్షణను అందించాలని ఎస్టీసంక్షేమశాఖ నిర్ణయించింది. సివిల్స్ ప్రిలిమ్స్ మొదలుకుని ఎస్‌ఐ మెయిన్స్, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, ఉద్యోగ అవకాశాలు కలిగిన ఐటీ శిక్షణ, ఎస్టీలకు గ్రాడ్యువేట్ స్పెషల్ కోచింగ్‌లకు శిక్షణను ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇచ్చే శిక్షణను 2016-17 నుంచే ప్రారంభిస్తున్నట్లు ఇందుకోసం అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్టీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ శిక్షణకు తెలంగాణకు చెందిన స్థానిక ఎస్టీ అభ్యర్థులు అర్హులని, గ్రామీణ ప్రాంతాల్లో వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ. లక్షన్నర, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మంగళవారం (9వ తేదీ) నుంచి ఈనెల 16వ తేదీలోగా http://studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన సమాచారం పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లో ఉందని, మరిన్ని వివరాల కోసం 040-27540104 సంప్రదించాలని సూచిచారు.
Advertisement
Advertisement