యాడికి (తాడిపత్రి) : కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని నాగలీల (17) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం యాడికిలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు ... కోన రోడ్డులో నివాసముంటున్న నారాయణస్వామి కుమార్తె నాగలీల ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది.
నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
Feb 28 2017 1:23 AM | Updated on Nov 6 2018 7:53 PM
యాడికి (తాడిపత్రి) : కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని నాగలీల (17) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం యాడికిలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు ... కోన రోడ్డులో నివాసముంటున్న నారాయణస్వామి కుమార్తె నాగలీల ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి తలకు గాయమైంది. మతిస్థిమితం కోల్పోయిన ఈమె కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసి¯ŒS పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఏఎస్‌ఐ మల్లికార్జున పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement