
ఎక్కడమ్మా.. బంగారు తల్లీ?
- కానరాని ‘మా ఇంటి మహాలక్ష్మి’
- లబ్ధిదారుల బ్యాంకుల్లో జమకాని డబ్బు
- శ్రీకాళహస్తి డివిజన్‌లో 2,193 వుంది
- లబ్ధిదారుల ఎదురుచూపులు
శ్రీకాళహస్తి రూరల్ : ఏపీ లో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. కొందరు మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడే స్కానింగ్ చేయించి ఆడబిడ్డ అని తేలితే గర్భస్రావం చేయిస్తున్నారు. దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాలికా సంరక్షణ పథకం అమలు చేశారు. మే 2005 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు ఈ పథకాన్ని వర్తింప చేస్తూ ఒక బాలిక ఉంటే రూ.లక్ష, ఇద్దరు బాలికలు మాత్రమే ఉంటే రూ.60 వేలు పిల్లలకు మైనర్ తీరిన తర్వాత ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా బాలికల చదువును పోత్స్రహించడానికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (4 సం) వరకు ఏడాదికి రూ.1200 చొప్పున స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేశారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2013 మే నెలలో ఈ పథకాన్ని బంగారు తల్లిగా మార్చారు. ఈ పథకంలో ఆడ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి బ్యాంకు ఖాతాలో రూ.2500 జమ చేస్తారు. సంవత్సరం నిండిన తర్వాత రూ.1000, రెండవ సంవత్సరంలో రూ.1000, తర్వాత 5 సంవత్సరాల వరకు ఒక్కొక్క సంవత్సరానికి రూ.1500, అనంతరం 5వ తరగతి వరకు సంవత్సరానికి రూ. 2 వేలు, 6 నుంచి 8 వ తరగతి వరకు సంవత్సరానికి రూ.2500 ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. 9, 10 తరగతులకు సంవత్సరానికి రూ.3 వేలు, ఇంటర్మీడియెట్‌లో సంవత్సరానికి రూ.3500, గ్రాడ్యువేషన్‌లో నాలుగు సంవత్సరాలకు సంవత్సరానికి రూ.4 వేలు చొప్పున మొత్తం రూ.55,500 వచ్చేలా పథకాన్ని రూపొందించారు. బాలికలకు 21 ఏళ్లు నిండిన తర్వాత అదనంగా రూ. లక్ష ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
రెండేళ్లు పూర్తి అయినా...
బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టి ఇప్పటికి మూడేళ్లు పూర్తి అయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి డివిజన్‌లో 2,193 మంది లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.2500 జమ చేశారు. తర్వాత ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. శ్రీ కాళహస్తి మండలంలో 472 మంది, ఏర్పేడులో 429 మంది, తొట్టబేడులో 317 మంది, రేణిగుంటలో 498 మంది, బుచ్చినాయుడు కండ్రిగలో 272 మంది, కేవీబీపురంలో 205 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.76,75,500 బ్యాంకుల్లో జమచేయాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పథకానికి మంగళం పాడింది.
కానరాని మా ఇంటి వుహాలక్ష్మి
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 జూన్ లో బంగారు తల్లి పథకాన్ని రద్దు చేసి మా ఇంటి మహాలక్ష్మిని ప్రవేశపెట్టారు. బంగారు తల్లి పథకం ఐకేపీ పర్యవేక్షణలో కొనసాగింది. మా ఇంటి మహా లక్ష్మి పథకాన్ని ఐసీడీఎస్‌కు అప్పగించనున్నట్టు సమాచారం. ప్రతి మండలంలోనూ కొత్తగా ఈ పథకానికి అర్హులైన వారు 400 పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పథకాన్ని రద్దు చేసి ఏడాది కావస్తున్నా ఇప్పటకీ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో తమకు ఈ పథకం వర్తిస్తుందా..? లేదా? అని అనేక మంది లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐకేపీ, ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా ఇంతవరకు తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని చెబుతున్నారు.
ఆడబిడ్డలకు ప్రభుత్వం ఆసరా ఉండాలి
ఆడబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దివంగత ముఖ్యవుంత్రి వైఎస్సార్ ఆడపిల్లల సంరక్షణకు బాలికా సంరక్షణ పథకం ఏర్పాటు చేశారు. ఆయున మృతి చెందాక ఆ పథకం నీరుగారిపోతోంది. నేటి పాలకులు చొరవ చూపాలి.
- అక్కుపల్లి వుంజుల, సర్పంచి, గంగలపూడి
పథకాలు వూర్చడం ఎందుకో
కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా పాత పథకాలను మారుస్తున్నారు. ఇది సరికాదు. కొత్తగా వచ్చిన పాలకులు నిరుపేదల సంక్షేమం కోసం వురికొన్ని పథకాలు ప్రవేశపెట్టాలి. పాతవాటిని రద్దు చేసే విధానాలకు పాలకులు స్వస్తి పలకాలి.
- అమ్మపాలెం రావుబత్తెమ్మ, సర్పంచి, కాపుగున్నేరి