- పీసీసీ సభ్యుడు ఈర్ల కొమురయ్య
చివరి భూములకు ఎస్సారెస్పీ నీళ్లివ్వండి
Published Sun, Jul 24 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
కాల్వశ్రీరాంపూర్: ఎస్సార్‌ఎస్పీ చివరి భూములకు డి–86, డి–83 కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని పీసీసీ సభ్యుడు ఈర్ల కొమురయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా వర్షాబావంతో టేలాండ్ ప్రాంత రైతులు కరువుతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం హరితహారం పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తోందని ఆరోపించారు.
రైతులకు రుణాల మంజూరులో విఫలమైందని విమర్శించారు. హరితహారంపై పర్యవేక్షణ లేకపోతే కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యే అవకాశముందన్నారు. అధికారులు వారాంతపు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. డబుల్‌బెడ్ రూం కోసం నిరుపేదలు గంపెడాశతో ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మునీర్, చిలువేరు రాజయ్య, సతీశ్, అశోక్ గౌడ్, శ్రీనివాస్, శివశంకర్, తాజ్, రాజు, రాజయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement