ఎస్సారెస్పీ 71 డీబీఎం కాల్వకు నీటి విడుదల
ఎస్సారెస్పీ 71 డీబీఎం కాల్వకు నీటి విడుదల
Published Tue, Sep 27 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
అర్వపల్లి : ఎస్సారెస్పీ రెండో దశ పరిధిలోని 71 డీబీఎం కాల్వకు ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రి నుంచి నీటిని వదిలారు. వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి కొడకండ్లలోని అవుట్ ఫ్లో గేటు ద్వారా 69 డీబీఎంకు 500 క్యూసెక్కులు, 71 డీబీఎంకు 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 69 డీబీఎం ద్వారా నీళ్లు తుంగతుర్తి, నూతనకల్ మండలాలకు, 71 డీబీఎం ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి నీటిని ఇస్తున్నారు. 15 రోజుల పాటు ఈ కాల్వలకు నీటిని వదలాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, కాల్వలను ఈఈ సుధీర్, డీఈలు సునీల్, ప్రసాద్, సలీంబేగ్, ప్రవీణ్, ఏఈఈ హరికృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Advertisement