తాత్కాలికంగా గోదావరి జలాల నిలిపివేత
తాత్కాలికంగా గోదావరి జలాల నిలిపివేత
Published Tue, Oct 4 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
అర్వపల్లి:
శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ)కు గోదావరి జలాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరంగల్ జిల్లాలో పెద్దమ్మగడ్డ వద్ద కాకతీయ కాలువకు గండిపడిన చోట మరమ్మతు పనులు జరుగుతుండటంతో నీటిని నిలిపివేశారు. అయితే వరంగల్ జిల్లాలోని మైలారం రిజర్వాయర్, బయ్యన్న వాగులలో ఉన్న నీటిని ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలోని 69, 71 డిస్ట్రిబ్యూటర్‌లకు విడుదల చేశారు. అయితే వాటిలో నీళ్లు తగ్గడం, పైనుంచి రాకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. కాకతీయ కాలువకు పడిన గండిని పూడ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఎల్‌ఎండి (లోయరు మానేరు డ్యాం) నుంచి వరంగల్ జిల్లాకు వదిలి మైలారం రిజర్వాయర్, బయ్యన్న వాగులను నింపి ఆ తర్వాత జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేస్తామని ఎస్సారెస్పీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
Advertisement