ఉరకలేస్తున్న గోదావరి
Published Sun, Sep 25 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
సారంగాపూర్ : మండలంలోని పలుగ్రామాల తీరం వెంబడి ప్రవహిస్తున్న గోదావరి ఉరకలేస్తోంది. దీంతో కమ్మునూర్, చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, మంగేళ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కమ్మునూర్‌లోని పుష్కరఘాట్‌లపై నుంచి ఆంజనేయస్వామి ఆలయం సమీపం వరకు నీరు చేరింది. చిన్నకొల్వాయిలో ఎత్తిపోతల పథకంకోసం ఏర్పాటు చేసిన రక్షణ గోడ మునిగింది. మంగేళ గ్రామం ఎత్తిపోతల పథకాలను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. చిత్రవేణిగూడెంలోనూ గోదావరి ప్రవాహం ఆందోళన కలిగించే స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీటి ఉధృతి పెరిగింది.
Advertisement
Advertisement