భ్రమరాంబకు బంగారు హారం విరాళం | gold chain donation for bramaramba | Sakshi
Sakshi News home page

భ్రమరాంబకు బంగారు హారం విరాళం

Published Wed, Feb 8 2017 12:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

gold chain donation for bramaramba

శ్రీశైలం:  శ్రీశైల మహాక్షేత్రంలో అష్టాదశ శక్తిపీఠంగా వెలిసిన శ్రీభ్రమరాంబాదేవికి హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌కు చెందిన జయంతి సుబ్బారావు, రామలక్ష్మిలు రూ.1.50 లక్ష విలువైన 47 గ్రాముల బంగారు హారాన్ని మంగళవారం విరాళంగా అందజేశారు. స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించుకున్న అనంతరం బంగారు హారానికి సంప్రోక్షణ పూజలను చేసి  అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేకపూజలను నిర్వహించిన తరువాత ఆశీర్వచన మండపంలో ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు ఉమామహేష్‌లకు అందించారు. దీంతో పాటు 8 గ్రాములతో తయారు చేసిన నల్లపూసల బంగారు గొలుసును కూడా వారు అందజేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అనంతరం దాతలకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను ఏఈఓ బహూకరించారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement