తక్కువ కస్టమర్లు ఉన్నవే.. వీరి టార్గెట్‌ | gold finance company thives arrested in vizag | Sakshi
Sakshi News home page

తక్కువ కస్టమర్లు ఉన్నవే.. వీరి టార్గెట్‌

Published Thu, Feb 9 2017 6:50 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

gold finance company thives arrested in vizag

విశాఖపట్నం :
తొమ్మిది మంది సభ్యులు గల ఓ బిహార్‌ దోపిడీ ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఐదు పిస్టళ్లు, ఒక తపంచా, 85 బుల్లెట్లు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా నాగ్‌పూర్‌, బర్రాక్‌పూర్‌ ప్రాంతాలలో మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో ఇదివరకే దోపిడీకి పాల్పడ్డారు.

విశాఖపట్నంలో బంగారం ఫైనాన్సు కంపెనీలను టార్గెట్‌గా చేసుకుని దోపిడీ చేయడానికి స్కెచ్‌ వేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దోపిడీ ముఠా మొదట దోపిడీ చేయాలనుకున్న ప్రాంతంలో ఓ రూం అద్దెకు తీసుకుంటారు. మోటారు సైకిల్‌ కొనుక్కుని గోల్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. కస్టమర్లు లేని, తక్కువగా ఉన్న వాటిని ఎంచుకుని తుపాకులు చూపించి దోపిడీ చేస్తారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement