బంగారు ఆభరణాల అపహరణ | Gold jewelery theft | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాల అపహరణ

Published Thu, Aug 4 2016 11:37 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

Gold jewelery theft

  • రాంచంద్రాపురం కాలనీలో ఘటన 
  • మహబూబాబాద్‌ : పట్టణంలోని రామచంద్రాపురం కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు బుధవారం చోరీకి పాల్పడినట్లు టౌన్‌ సీఐ నందిరామ్‌ నాయక్‌ తెలిపారు. సీఐ కథనం ప్రకారం..  కాలనిలోని ఎన్టీఆర్‌ స్టేడియం వెనుక భాగంలో బానోత్‌ భీముడు తన కుటుం బంతో నివాసం ఉంటున్నాడు. భీముడు కురవి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇద్దరూ ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లగా దొంగలు తాళం పగులగొట్టి రెండున్నర  తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. కాగా ఆ దంపతులు గురువారం టౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement