
యూఏఈ, ఖతర్‌లో కార్మికులకు శుభవార్త
- ఆరు నెలల కనీస కాలపరిమితి ఎత్తివేత
- జనవరి 1 నుంచి అమలు
రాయికల్: యూఏఈ, ఖతర్‌లో ఉపాధి పొందుతున్న కార్మికులకు శుభవార్త. ఉపాధి నిమిత్తం యూఏఈలోని అబుదాబి, అజ్మాన్, షార్జా, దుబాయ్, ఫుజారహ్, రసల్‌ఖైమా, ఉమర్‌అల్ క్వైన్, ఖతర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఆయా కంపెనీల్లో రెండేళ్లు కచ్చితంగా పనిచేయాలనే ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఆయా దేశాలు, కంపెనీల్లో పనిచేసే కార్మికులు పని నచ్చినా.. నచ్చకున్నా కచ్చితంగా రెండేళ్లు పనిచేయాల్సి వచ్చేది.
ఒకవేళ పనిచేయకుండా స్వదేశానికి తిరిగివస్తే మళ్లీ ఆరు నెలలపాటు ఆయా దేశాలకు వెళ్లే అవకాశం ఉండదు. ఈ గడువును యూఏఈలోని మినిస్టర్ ఆఫ్ లేబర్ కౌన్సిల్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఖతర్‌లోనూ ఈ నిబంధనను ఎత్తేశారు. జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో వలస కార్మికులకు ఊరట లభించనుంది.