ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ)కు శుభవార్త. జిల్లాకు 98 పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (పీడీ)గా అప్‌గ్రేడేషన్ చేసింది.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ)కు శుభవార్త. జిల్లాకు 98 పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (పీడీ)గా అప్‌గ్రేడేషన్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు జాబితా చేరింది. 2009లో జిల్లాకు 30 పీడీ పోస్టులు మంజూరయ్యాయి. మళ్లీ ఇప్పుడు 98 పోస్టులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం సుమారు 300 మంది పీఈటీలు పని చేస్తున్నారు. వీరిలో 200 మంది కాదా బీపీడ్ చేశారు. అంటే వీరందరూ పదోన్నతులకు అర్హులు.
మంజూరు చేసిన 98 పోస్టుల్లో 2001 డీఎస్సీ నుంచి ఎంపికైన వారికి అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 2006 డీఎస్సీ వారికి ఒకరిద్దరికి పదోన్నతులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అధికంగా కనేకల్లు మండలంలో నాలుగు పోస్టులు, లేపాక్షి. డి.హీరేహాల్, విడపనకల్లు, గోరంట్ల, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, మండలాల్లో మూడు పోస్టులు మంజూరయ్యాయి. అలాగే పలు మండలాలకు రెండు, ఒక్కో పోస్టు మంజూరైంది.