
మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్
పాన్‌గల్ : రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ ఆరోపించారు. శుక్రవారం పాన్‌గల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాగా ప్రకటించి ఎనిమిది నెలలైనా రైతులకు పరిహారం అందలేదన్నారు.
భీమా కాల్వల లైనింగ్, పంట కాల్వలను పూర్తి చేశాకే నీటిని విడుదల చేయాలన్నారు. దళిత, గిరిజనులకు భూపంపిణీ, మైనారిటీలకు రిజర్వేషన్ అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఇలా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 17 తర్వాత పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు వెంకటయ్య, ఫయాజ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.