No Care
-
నిధులు ఆవిరి..పారిశుద్ధ్యం కానరాదేమీ..!
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసమే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రూ.459 కోట్లు ఖర్చు చేశారు. అవీ తూతూ మంత్రం గా నిర్మించడమే గాక, ఎక్కడా వాటి వెంబడి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇళ్ల మధ్య మురుగునీరు ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. మురుగునీరు పోవడానికి కాలువలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా అంటువ్యాధులు, రోగాలు ముసురుతున్నాయి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలైన జన్మభూమి కమిటీల నిర్వాకంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత ఐదేళ్లలో భారీగా నిధులిచ్చినా గ్రామాల్లో పరిస్థితి మారలేదని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శాంపిల్ సర్వే అద్దంపట్టడం గమనార్హం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామని, ఇది తమ ఘనతని గత టీడీపీ పాలకులు ప్రతి వేదికపైనా ఊదరగొట్టేవారు. వాస్తవానికి 30 శాతం వరకూ కమీషను మిగుల్చుకోవడానికి కేవలం సీసీ రోడ్లు మాత్రమే తూతూ మంత్రంగా వేసేశారు. కానీ ఇళ్ల మధ్య నుంచి మురుగునీరు పోవడానికి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన నిధుల్లో రూ.459 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. కానీ ఆ స్థాయిలో గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడలేదు. ఇవిగాక గత ఐదేళ్లలో 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం పేరుతోనూ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. జన్మభూమి కమిటీల నిర్వాకం... పేదలైన కూలీలకు సొంత ఊరిలోనే పనులు కల్పిస్తూ మరోవైపు గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలకు మాత్రం కాసుల కక్కుర్తే ప్రధాన ధ్యేయమైంది. చివరకు గ్రామ పంచాయతీల ప్రకారమే అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా తమకు కాసులు కురిపించే పనులనే చేయించారు. సీసీ రోడ్లలో 30 శాతం వరకూ కమీషన్లు రావడంతో వాటికే మొగ్గు చూపించారు. మురుగు కాలువల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కొన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎక్కడ పనులు చేశారో వారికే తెలియట్లేదు. టీడీపీ పెద్దల ఒత్తిళ్లతో కొంతమంది అధికారులు కూడా బిల్లులను ఆమోదించేశారు. ఫలితం ఇప్పుడు గ్రామాలు చాలా వరకూ పారిశుద్ధ్యలోపంతో సతమతమవుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడుతున్నారు. -
ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేదు
సాక్షి, రణస్థలం: రసాయనిక పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కరువవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ప్రతి ఏడాది మృత్యువాత పడుతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం భద్రత కల్పిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నాయే తప్ప ఆచరణలో చూపడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో పైడిభీమవరం పారిశ్రామికవాడలో ఉన్న వివిధ పరిశ్రమల్లో 10మంది చనిపోయారు. రసాయనిక పరిశ్రమలో కానరాని భద్రత.. రసాయనిక పరిశ్రమలో నైపుణ్యం కల్గిన ఉద్యోగస్తులు ఉండాలి. ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలనే దురాలోచనతో సబ్ కాంట్రాక్టర్లకు పరిశ్రమ నిర్వహణ అప్పగిస్తున్నారు. సబ్ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేనివారికి తక్కువ వేతనాలు ముట్టచెప్పి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది. గత 20 ఏళ్లుగా పైడిభీమవరంలో దాదాపు 20 వరకు చిన్న పెద్ద రసాయనిక పరిశ్రమలు ఉన్నా నేటికీ సరైన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయలేదు సరికదా, భద్రతపై ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వలేదు. భద్రత పరికరాలు సమకూర్చడం లేదు. పారిశ్రామికవాడలో కానరాని ఈఎస్ఐ ఆసుపత్రి.. కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరిగినా, ఆరోగ్యం బాగోలేకపోయిన ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకువెళతారు. కానీ పైడిభీమవరంలో ఈఎస్ఐ ప్రాధమిక చికిత్స కేంద్రం తప్ప, కనీసం 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి సదుపాయం కూడా గత ప్రభుత్వాలు కల్పించలేకపోయాయని కార్మిక సంఘాలు తరుచూ గగ్గోలు పెడుతున్నాయి. ఏ చిన్న ప్రమాదం జరిగిన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయగనగరం, 70 కిలోమీటర్ల దూరం ఉన్న విశాఖపట్నం తరలించాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన∙వ్యక్తం చేస్తున్నారు. తరలించేలోగానే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కార్మికులు ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగిస్తున్నారు.. భద్రత గురించి కార్మికులు పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దీంతో కార్మికులు భయపడి ఎవరికీ చెప్పకోక ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. – కె.గురునాయుడు, అరబిందో సీఐటీయూ వర్కర్స్ యూనియన్ నాయకుడు భద్రత చర్యలు తీసుకోవడం లేదు.. ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడం లేదు. భద్రత పరికరాలు సక్రమంగా ఇవ్వటం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి లోపాలు ఉంటే సరిచేయమని చెప్పాలి. – పి.తేజేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు కార్మికుల భద్రతపై పరిశ్రమ యాజమాన్యాలు దృష్టి సారించాలి.. ప్రతి ఏడాది పరిశ్రమలోని భద్రత వైఫల్యాలపై నివేదిక అందిస్తాం. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు భద్రతపై గుర్తు చేస్తుంటాం. తక్షణమే పరిశ్రమ యాజమాన్యాలు సరిచేసుకోవాలి. – జి.వి.వి.ఎస్.నారాయణ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ -
ఆంత్రాక్స్ ముప్పు పట్టించుకోని గిరిజనం
హుకుంపేట (అరకులోయ): మన్యంలో ప్రతి ఏడాది ఆంత్రాక్స్ వ్యాధి తీవ్రత నెలకొంటున్నప్పటికీ గిరిజనులు మాత్రం ఆ వ్యాధి గురించి ఏ మాత్రం భయపడడం లేదు. కొన్ని వర్గాల గిరిజనులు మాత్రం పశుమాంసం వినియోగాన్ని మానడం లేదు. అయితే పశు వైద్యుల పరీక్షలు అనంతరం పశువులను వధించి, తరువాత మాంసంపై పశుసంవర్థ్ధకశాఖ సీల్ వేయాలనే నిబంధనలను పశువైద్యులు, సంబంధిచ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పశువైద్యుల సూచనలు మేరకు తాజా పశు మాంసాన్ని బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ ఏజెన్సీలో మాత్రం వ్యాపారులు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు వ్యాధులతో బక్కచిక్కిన పశువులు, చనిపోవడానికి కొన ఊపిరితో ఉన్న పశువులు, ఒక్కో సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మృతి చెందిన పశువులను వధించి, సంతల్లో విచ్చలవిడిగా పశుమాంసం అమ్మకాలు జరుపుతున్నారు. అయితే పశు మాంసం అమ్మకాలు వ్యాపారులకు సిరులు కురిపిస్తుండగా వినియోగిస్తున్న గిరిజనులు మాత్రం పలు రోగాల బారిన పడుతున్నారు. వ్యాధులతో చనిపోయిన పశువులను ఖననం చేయకుండా, వాటిని కోసిన వారికి, అలాగే ఈ మాంసం వండుకు తిన్నవారికి ఆంత్రాక్స్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చర్మవ్యా«ధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి శనివారం హుకుంపేట సంతలో ఆవులను వ«ధించిన వ్యాపారులు, ఎలాంటి పశువైద్యులు పరీక్షలు లేకుండానే యథేచ్ఛగా∙ఈ మాంసాన్ని భారీగా విక్రయిస్తున్నారు. అయితే బక్కచిక్కి,బాగా నీరసించిన పశువులనే కోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమాయక గిరిజనులు ఈ పశు మాంసాన్నే కొనుగోలు చేసి తమ ఇళ్లకు తీసుకు వెళుతున్నారు. సంతలోనే వంటలు.. పశుమాంసాన్ని కొంతమంది సంతలోనే వండి ఫాస్ట్ఫుడ్ మాదిరిగా వ్యాపారం చేస్తున్నారు. సంతల్లో కల్లు, ఇతర మద్యం సేవిస్తున్న గిరిజనులు ఈ పశుమాంసం తింటున్నారు. పశుమాంసంను బాగా ఉడకబెట్టి నాణ్యంగా తయారు చేసిన తరువాత తింటే అనారోగ్య సమస్యలు ఉండవని వైద్యులు చెబుతుండగా, ఈ సంతలో మాత్రం నామమాత్రంగా అక్కడికక్కడే ఉప్పు కారం వేసి, ఉడకబెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పశుమాంసంను తింటున్నారు. తనిఖీలు జరుపుతాం.. సంతలో పశువుల వధ. మాంసం నాణ్యతను నిర్థారించేందుకు తనిఖీలు చేపడుతున్నాం. అనారోగ్యంతో బాధపడే పశువులు, మృతి చెందిన పశువుల మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – సునీల్, పశువైద్యాధికారి -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
పాన్గల్ : రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ ఆరోపించారు. శుక్రవారం పాన్గల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాగా ప్రకటించి ఎనిమిది నెలలైనా రైతులకు పరిహారం అందలేదన్నారు. దీంతో ఖరీఫ్ సీజన్ పెట్టుబడులకోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఇటు మూడోవిడత రుణమాఫీ, అటు పరిహారం అందక నానా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. భీమా కాల్వల లైనింగ్, పంట కాల్వలను పూర్తి చేశాకే నీటిని విడుదల చేయాలన్నారు. దళిత, గిరిజనులకు భూపంపిణీ, మైనారిటీలకు రిజర్వేషన్ అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఇలా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 17 తర్వాత పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు వెంకటయ్య, ఫయాజ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.