గుండ్లకమ్మ నదిలో నీరు
గుండ్లకమ్మ నదిలో నీరు
Published Sun, Aug 28 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
నూజెండ్ల : రెండురోజులగా కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ నదికి ఒక మోస్తరుగా నీరు చేరింది. మండలంలోని ఉప్పపాడు వద్ద గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది. రెండేళ్ల నుంచి చుక్కనీరు కూడా లేక ఎండిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నదిపై సాగు,తాగునీరు కోసం 20కి పైగా గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఎగువన కురిసిన వర్షాలకు నదికి నీరు రావడంలో కొంత మేర నీటి సమస్య తీరిందని పలువురు అంటున్నారు.
Advertisement
Advertisement