
సివిల్‌ఆస్పత్రిలో మొక్కలు నాటుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
తెలంగాణ హరితహారం అందరిలో స్ఫూర్తిని నింపాలని తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి అన్నారు. స్థానిక సివిల్ ఆస్పతి ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయ్‌గాంధీలతో కలసి ఆయన ప్రారంభించారు.
బూర్గంపాడు: తెలంగాణ హరితహారం అందరిలో స్ఫూర్తిని నింపాలని తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి అన్నారు. స్థానిక సివిల్ ఆస్పతి ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయ్‌గాంధీలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బూర్గంపాడు మండలం హరితహారంలో జిల్లాలో అగ్రగామిగా నిలవాలన్నారు. పినపాక పట్టీనగర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఐసీyీ ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీపీ రోశిరెడ్డి, జెడ్పీటీసీ గాంధీ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, ఐసీడీఎస్ సీడీపీఓ స్వర్ణలత లెనినా, ఎంఈఓ కే వెంకటేశ్వరరావు, సర్పంచ్ పుట్టి కుమారి, ఈజీఎస్ ఎపీఓ శ్రీలక్ష్మీ, ఈసీ నవీన్, సివిల్ ఆస్పత్రి వైద్యులు భాస్కర్‌నాయక్, శ్వేత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.