
ఉద్యమంలా హరితహారం
♦ జిల్లాలో జోరుగా సాగుతున్న కార్యక్రమం
♦ ఒక్కరోజులో నాటిన మొక్కలు 10.27లక్షలు
♦ అన్ని వర్గాల నుంచి భారీ స్పందన టపలుచోట్ల పాల్గొన్న మంత్రులు
జీవకోటికి మొక్కలే జీవనాధారం. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలి. భవిష్యత్ తరాలకు నీరు కావాలంటే ఇప్పటి నుండే మొక్కలు నాటాలి. హరితహరం కార్యక్రమాన్ని ఊరూరా సామాజిక ఉద్యమంగా చేపట్టాలి. అడవులను సంరక్షించు కోకపోవడం వల్లే ప్రస్తు తం వర్షాలు లేక ఇబ్బందు లు పడుతున్నాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవడం చాలా ముఖ్యం. ఇక ముందు ప్రతి యేడు 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం. - ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పచ్చలహారంగా మార్చేందుకు జిల్లా యావత్తు పరుగులు పెడుతోంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని వర్గాలు ముందుకు కదులుతున్నారుు. సోమవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 10.27లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలతోపాటు సామాన్య ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యారు. ఈనెల 8 నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టగా.. ఇప్ప టివరకు జిల్లాలో మొత్తంగా 21.17లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నారుు.
ప్రముఖుల హడావుడి..
హరితహారం కార్యక్రమానికి ప్రముఖుల రాక మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బీహెచ్‌ఈఎల్ టౌన్ షిప్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గవర్నర్ నరసింహన్ తోపాటు రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, మహేందర్‌రెడ్డి తదితరులు మొక్కలు నాటారు. అదేవిధంగా వి కారాబాద్‌లో సీసీఎల్‌ఏ రేమండ్‌పీటర్, యాచారంలో ఇం టెలిజెన్ ్స ఐజీ శివధర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కలెక్టర్ రఘునందన్ రావు, జేసీ ఆమ్రపాలి, ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ ఈస్ట్ జోన్ కమిషనర్ మహేష్‌భగవత్ మొక్కలు నాటారు.
పరిశ్రమల శాఖ ‘లక్ష’ణంగా ముందుకు..
హరితహారం కింద ఈసారి పరిశ్రమల శాఖ దూసుకుపోతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 21.17లక్షల మొక్కలు నాటగా.. ఇందులో పరిశ్రమల శాఖ తరఫున ఏకంగా 1.07లక్షల మొక్కలు నాటి ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 91వేల మొక్కలు నాటి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రెండో స్థానంలో నిలవగా.. 90వేల మొక్కలతో గచ్చిబౌలి ఐటీ పార్క్ మూడోస్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా నాటిన మొక్కల్లో 39,910 రిజర్వ్ ఫారెస్ట్‌లో నాటగా.. 20,77,680 మొక్కలు ఇతర ప్రాంతాల్లో నాటినట్లు జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.