కణేకల్లు : జిల్లాలో ధాన్యగారంగా పేరుపొందిన కణేకల్లులో బియ్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో రైతులు నాణ్యమైన వరిని సాగు చేస్తున్నారు. జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, గుంతకల్లు, ఉరవకొండ, కొత్తచెరువు, బుక్కపట్నం, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికొచ్చి బియ్యాన్ని తీసుకెళ్తున్నారు. దీంతో కణేకల్లులో బియ్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.
ఖరీప్ సీజన్ ప్రారంభంలో క్వింటాళు బియ్యం రూ.3,070 ఉండగా రోజురోజుకూ బియ్యం ధర పెరుగుతోంది. గత వారం క్వింటాళు బియ్యం రూ.3,300 ఉంది. నాలుగైదు రోజుల కింద కాస్తా తగ్గి రూ.3,200కు చేరింది. ఫస్ట్ క్వాలిటీ బియ్యం రూ.3,200, సెకెండ్ క్వాలిటీ బియ్యం రూ.3,170 పలుకుతోంది.
తుకాల్లో జాగ్రత్త అవసరం..
బియ్యం వ్యాపారంలో రాటుదేలిన కొందరు వ్యాపారులు అమాయకులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 25 కేజీల ప్యాకెట్‌కు కేజీ, 50 కేజీల ప్యాకెట్‌కు కేజీ నుంచి 2 కేజీల వరకు తక్కువ ఇస్తున్నట్లు సమాచారం. తక్కువ ధకు ఇస్తున్నామని చెబుతూనే తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో ప్యాకెట్లు కొనుగోలు చేసేవారు మధ్యలో కొన్నింటిని తూకం వేసుకొని తీసుకుపోవడంతో వల్ల మోసాలను నివారించవచ్చునని కొందరు వ్యాపారులు సూచిస్తున్నారు.
కణేకల్లు బియ్యానికి భారీ డిమాండ్
Published Sat, Jan 7 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
Advertisement