‘సీఅర్చిన్’ వింత.. నాగాయలంక చెంత!
‘సీఅర్చిన్’ వింత.. నాగాయలంక చెంత!
Published Fri, Sep 9 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
నాగాయలంక : నాగాయలంక సముద్రతీరంలో ఈ మధ్య తరచూ కనిపిస్తున్న వింత ముళ్ల చేపలు సముద్రంలో మార్పులకు సంకేతమని మత్స్య పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గుండ్రని ముళ్ల బంతిలాగా కనిపిస్తున్న ఈ చేపలు సీఅర్చిన్ జాతికి చెందినవిగా అంతర్జాల అధ్యయనం ద్వారా తెలుస్తోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్తున్న జాలర్లకు దొరికే చేపలతో పాటు ఈ ముళ్లబంతి చేపలు వలల్లోకి వస్తున్నాయి. వాస్తవానికి ఈ జాతి చేపలు సముద్రంలోని రాతి గుహలు, నాచురాళ్ల గుట్టల్లో పెరుగుతుంటాయని తెలుస్తోంది. ఈ జాతి చేపలు ఇక్కడకి ఎలా వస్తున్నాయనే ప్రశ్నకు సముద్రంలో సంభవించే మార్పులు కారణం కావచ్చని భావిస్తున్నారు.
విదేశాల్లో ఈవింత చేపలకు గిరాకీ ఉన్నట్లు వినికిడి
సీఅర్చిన్ చేపలను విదేశాల్లో తింటున్నారు కాబట్టి అక్కడ వీటికి బాగా గిరాకీ ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ చేపలు ఒక్కోటి 50 గ్రాముల నుంచి కిలో సైజు వరకు ఉంటాయని సమాచారం.
ఇక్కడ జాలర్లకు అవగాహనలేకే..
ఈ చేపలు తినడానికి పనికివస్తాయని ఈ ప్రాంత జాలర్లకు కూడా తెలియదు. చేపల వేటలో తమకు ఆటంకం కలిగించే పిచ్చిజాతి చేపలుగానే ఈ ప్రాంతవాసులకు తెలుసు. దీంతో వాటిని తీసిపారేయడం మినహా ఇక్కడ ఎవరూ పట్టించుకోవడంలేదు. నాగాయలంక కృష్ణా నదిలో కేజ్ కల్చరిస్ట్‌గా ప్రాచుర్యం పొందిన యువ ఆక్వా శాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్ మత్స్యకారుల దగ్గర తరచూ కనిపించడంతో ఆరా తీయడంతో వీటిని సీఅర్చిన్ (ట్ఛ్చuటఛిజిజీn)గా గమనించారు. అయితే వీటి క్రయవిక్రయాలకు తగినంతగా సరుకు లేదు. ఇక్కడ జాలర్లకు వలల్లో చిక్కుతున్న ఇవి యాభై, వంద గ్రాముల సైజులో మాత్రమే ఉంటున్నాయి.
Advertisement
Advertisement