వర్షంతో రోడ్లు జలమయం
Published Wed, Jul 27 2016 11:29 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. పట్టణంలోని అంబేద్కర్‌చౌక్, పంజాబ్‌చౌక్‌లలో రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటితో రోడ్ల పక్కనున్న మురికి కాల్వలు ఉధతంగా ప్రవహించాయి. రోడ్లపై గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. పంజాబ్‌చౌక్‌లో ఇటీవల నూతనంగా బ్రిడ్జి నిర్మించగా, పక్కన రోడ్డును మరమ్మతు చేయకపోవడంతో అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
Advertisement
Advertisement