ఆర్మీ, ఎన్‌సీసీ విభాగాల్లో ఆరోగ్యం కీలకపాత్ర
ఆర్మీ, ఎన్‌సీసీ విభాగాల్లో ఆరోగ్యం కీలకపాత్ర
Published Fri, Aug 19 2016 9:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
కమాండెంట్ కల్నల్ మోనీష్‌గౌర్
తుని రూరల్ :
ఆర్మీ విభాగంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉందని 18వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ కమాండెంట్ కల్నల్ మోనీష్‌గౌర్ అన్నారు. తుని మండలం రాజుపేట శ్రీప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరంలో శుక్రవారం ఎన్.సూరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్నల్ మోనీష్‌గౌర్ మాట్లాడుతూ ఎన్‌సీసీ శిక్షణలో కేడెట్లకు తరుచూ గాయాలవుతాయన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న కేడెట్లు సమర్థంగా విధులు నిర్వర్తించగలరన్నారు. దేశ రక్షణలో నిరంతరం సేవలు అందించే ఆర్మీ విభాగంలో పని చేసేవారందరు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమన్నారు. ఆర్మీ ఉద్యోగాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కీలకపాత్ర వహిస్తుందన్నారు. ఎన్‌సీసీ విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ రాజశేఖర్, మండల వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్, ఇతర వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. ఆరువందల మందికి వైద్య పరీక్షలు చేసినట్టు డాక్టర్ తెలిపారు. శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ ఎన్‌సీసీ థర్డ్ ఆఫీసర్ ఎం.సతీష్, క్యాంపు డిప్యూటీ కమాండెంట్ ఎం.ఎస్.రావత్, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫె్టనెంట్ ఎం.కృష్ణారావు, బీహెచ్‌ఆర్‌ఎం నాగర్కోటి, రమణమూర్తి, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, సూపరింటెండెంట్ గుమ్మడి అనిల్ కుమార్, సుబేదర్‌లు జోగిందర్‌సింగ్, రాంకుమార్, రెడ్డి, కెప్టెన్ ఎం.వి.చౌదరి, లెఫె్టనెంట్ రమణబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement