గ్లోబల్ కంపెనీలకు ఇండియన్లు సీఈవోలుగా అవడాన్ని సీఈవో వైరస్ ఫ్రం ఇండియా అంటూ చమత్కరించిన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సమకాలిన సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం స్పందిస్తుంటారు. దేశంలో ఏ మూలన అయినా సరే ఏదైనా మంచి కార్యక్రమం జరిగినట్టు ఆయన దృష్టికి వస్తే చాలు.. ప్రశంసలు కురిపించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయరు. తాజాగా నేషనల్ కేడెట్ కార్ప్ (ఎన్‌సీసీ) వాలంటీర్లు చేసిన పనిని ఆయన మెచ్చుకున్నారు.
ముంబై నగరంలోని ఓ బీచ్‌లో పునీత్ సాగర్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్లు ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. బీచ్‌లో పేరుకు పోయిన ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ సెంటర్లకు పంపించారు. ఈ ఫోటోలను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఎన్‌సీసీ బాధ్యత కలిగిన పౌరులను తయారు చేస్తుందంటూ కొనియాడారు.
Even as I participate in a committee to revamp the NCC I’m delighted to see & applaud this initiative. Under the PuneetSagar Abhiyan, the NCC has undertaken the cleaning of beaches & collection of plastic waste for recycling. The NCC produces good Citizens! pic.twitter.com/mvIOibX3cv
— anand mahindra (@anandmahindra) December 17, 2021
Comments
Please login to add a commentAdd a comment