జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇళ్లు కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలను మానవతాద క్పథంతో ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల పునరావాస కాలనీల మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
-
మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇళ్లు కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలను మానవతాద క్పథంతో ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల పునరావాస కాలనీల మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మొత్తం భూములు కోల్పోయి ఇళ్లు మాత్రమే మిగిలిన వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టులో సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలకు 15 రోజులు గడువు ఇచ్చి పునరావాస కాలనీలకు తరలించాలని సూచించారు. చెగ్యాం గ్రామంలో 34 ఇళ్ల సమస్య ఉందని, వారికి రీసర్వే ప్రకారం పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, పెద్దపల్లి, కరీంనగర్ ఆర్డీవోలు పి.అశోక్‌కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
తరలివచ్చిన ముంపు గ్రామాల ప్రజలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెగ్యాం, ముక్కట్రావుపేట, పాశిగాం, కోటిలింగాల ముంపు గ్రామాల ప్రజలు మంగళవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జేసీ శ్రీదేవసేన, జిల్లా అధికారులు నిర్వాసితులతో సమీక్ష నిర్వహించారు. ముంపు గ్రామాలకు చెందిన పలువురు బాధితులు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించడంలో అన్యాయం జరిగిందని, పరిహారాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం చట్టం ప్రకారం తన పని తాను చేసుకపోతుందని, అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్దామని, అందుకయ్యే ఖర్చులను సైతం తానే భరిస్తానని హామీ ఇచ్చారు.