వెంకన్న సేవలో అల్లు శిరీష్
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని యువ హీరో అల్లు శిరీష్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాట ఇటీవల ఆయన నటించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో వారు స్వామి సేవల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.