తగ్గిన హెచ్‌ఐవీ కేసులు
Published Thu, Dec 1 2016 2:23 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న పలు కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. హెచ్‌ఐవీ కేసుల సంఖ్య 1.14 శాతానికి తగ్గింది. గురువారం ప్రపంచ ఎరుుడ్‌స దినం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్‌ఐఐసీటీసీలు 72, పీపీపీలు 11, మొబైల్ ఐసీటీసీ 1సెంటర్‌లతో పాటు మొత్తం 105 సెంటర్లలో హెచ్‌ఐవీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ హాస్పిటల్‌లో ఏఆర్‌టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రుల్లో మూడు లింకుడ్ ఏఆర్‌టీ సెంటర్‌లు పనిచేస్తున్నారుు.
వీటి ద్వారా ఎరుుడ్‌స పాజిటీవ్ బాధితులకు ఉచిత వైద్య పరీక్షలతో, ఉచిత మందులు, గ్రూప్ కౌన్సెలింగ్, వ్యక్తిగత కౌన్సెలింగ్‌లను నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏఆర్‌టీ సెంటర్‌లో సీడీ-4 పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫిసిలిటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, జిల్లాలోని 13 ప్రై వేటు ఆస్పత్రుల్లో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఐసీటీసీలతో పాటు మిగతా సెంటర్లలో ఉచితంగా హెచ్‌ఐవీ పరీక్షలను నిర్వహించి పాజిటీవ్ అని తేలితే వారిని జిల్లా కేంద్రంలోని ఏఆర్‌టీ సెంటర్, సూర్యాపేటలోని ఏఆర్‌టీ సెంటర్లకు పంపిస్తారు. ఏఆర్‌టీ సెంటర్‌లోని వైధ్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 పరీక్షలను నిర్వహించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో సీడీ-4 పరీక్షలను చేసి 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్‌ఎన్‌ఆర్‌టీఐ, ఎన్‌ఆర్‌టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సెలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆదరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్‌టీ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలలు వాడుతున్న వ్యక్తులకు వారి దగ్గరలోని లింక్‌డ్ ఏఆర్‌టీ సెంటర్లకు పంపించి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. వేలాది మంది హెచ్‌ఐవీ పాజిటీవ్ బాధితుల్లో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు, కౌన్సెలర్లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు.
వలస కార్మికులు, లారీ డ్రైవర్లు అధికంగా ఉండే మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో కేసుల నమోదు అధికంగా ఉంటుంది. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుభం కార్యక్రమంతో పాటు నల్లగొండ యూత్ పాజిటీవ్ సొసైటీ, ఇతర స్వచ్చంద సంస్థలు, జిల్లా ఎరుుడ్‌స నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు తగ్గడం శుభ సూచికంగా పేర్కొనవచ్చు.
హెచ్‌ఐవీ బాధితులకు పెన్షన్లు
జిల్లా వ్యాప్తంగా 1371 మంది హెచ్‌ఐవీ బాధితులకు పెన్షన్లను అందజేస్తున్నారు. మరో 1200 మందికి పెన్షన్ల కోసం ప్రతిపాదనలను పంపించారు. 1721 మందికి ఉచిత బస్‌పాస్‌లను ప్రభుత్వం అందజేసింది.
2012 నుంచి మమత ప్లస్
2012 సంవత్సరం నుంచి హెచ్‌ఐవీ ఉన్న ప్రతి గర్భిణికి మమత ప్లస్ అనే కార్యక్రమం ద్వారా పుట్టే ప్రతి చిన్నారికి హెచ్‌ఐవీ రాకుండా కొత్తగా మం దులను ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
నేడు జిల్లా కేంద్రంలో ర్యాలీ
ప్రపంచ ఎరుుడ్‌స దినం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నారు. స్థానిక జిల్లా కేంద్రలోని గడియారం సెంటర్‌నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వరకు ర్యాలీని నిర్వహిస్తారు. ర్యాలీని ఉదయం 9 గంటలకు గడియారం సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రారంభిస్తారు. అనంతరం ఆస్పత్రిలో సమావేశం నిర్వహిస్తారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. నర్సింగ్ విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
Advertisement